Andhra Pradesh: ఏపీలో పింఛన్‌దారుకు భారీ గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి నెల పింఛన్‌పై కీలక అప్డేట్..
ఏపీలోని ఫించన్‌దారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఒకరోజు ముందగానే ఫించన్ సొమ్ము చేతికి అందనుంది. ఈ మేరకు జనవరి 31వ తేదీనే ఫించన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఇప్పటికే నిధులు విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో పింఛన్లు తీసుకుంటున్న లక్షలలాది మంది లబ్దిదారులకు ఊరట కలిగించింది. సాధారణంగా ఫించన్లు ప్రతీ నెల ఒకటవ తేదీ పంపిణీ చేస్తూ ఉంటారు. నేరుగా గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులు లబ్దిదారుల ఇంటికి వెళ్లి బయోమెట్రిక్ వివరాలతో ఒకటో తేదీ అందిస్తున్నారు. అయితే ఒకటో తేదీ పండుగలు లేదా సెలవులు వచ్చిన సందర్భాల్లో ముందు రోజే ఫించన్లను రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు పంపిణీ చేస్తోంది. దీంతో ఫించన్‌దారులకు ఒకరోజు ముందుగానే ఫించన్ డబ్బులు చేతికి వస్తుండటంతో తెగ సంతోష పడుతున్నారు. ఈ సారి కూడా ఒకరోజు ముందుగానే ఫించన్ సొమ్ము చేతికి అందనుంది. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
జనవరి 31న ఫించన్ పంపిణీ
ఫిబ్రవరి 1వ తేదీన ఈ సారి ఆదివారం వచ్చింది. దీంతో ఆ రోజు ప్రభుత్వ ఆఫీసులకు సెలవు దినం కాడవంతో ఒకరోజు ముందుగానే ఫించన్లు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 31వ తేదీనే ఫించన్‌దారుల ఇంటికి వెళ్లి సొమ్మును అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో దాదాపు 62.97 లక్షల మంది ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా నెలనెలా సామాజిక ఫించన్లు పొందుతున్నారు. దీంతో వీరికి ఫిభ్రవరి నెల ఫించన్ అందించేందుకు ప్రభుత్వం రూ.2,731 కోట్లను విడుదల చేసింది. ఇప్పటికే ఈ నిధులను విడదుల చేయడంతో జనవరి 31న ఫించన్ల పంపిణీకి రంగం సిద్దమైంది.
వారికి రూ.6 వేలు
ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్దులు, వితంతవులకు నెలనెలా రూ.4 వేల ఫించన్ అధికారులు అందిస్తున్నారు. ఇక వికలాంగులు, దివ్యాంగులకు రూ.6 వేలు ప్రభుత్వం అందిస్తోంది. గతంలో వృద్దులకు రూ.3 వేలు, మిగతా కేటగిరీలో ఉన్నవారికి రూ.4 వేలు అందిస్తుండగా.. కూటమి ప్రభుత్వం వచ్చాక వృద్దులకు రూ.4 వేలకు ఫించన్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక విగలాంగులు, దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచింది. దీంతో వృద్దులకు ఖర్చులకు సరిపోతున్నాయి. ఫిబ్రవరి నెల ఫించన్ ఒకరోజు ముందుగానే వస్తుండటంతో ఫించన్‌దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఆదివారం, పబ్లిక్ హాలీడేస్ వచ్చిన సందర్భంగా ప్రభుత్వం ముందుగానే ఫించన్ అందించింది. ఈ సారి కూడా అదే నిర్ణయాన్ని అమలు చేస్తోంది.
