AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Kale: ఆ క్యారెక్టర్ వల్ల రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు.. వాళ్లు ఎంత డేంజర్ అంటే..

నటుడు రవి కాలే దండుపాళ్యం చిత్రాల్లోని క్రూరమైన పాత్రలు తనను ఎంతగా ప్రభావితం చేశాయో వివరించారు. అలాంటి దృశ్యాలు చిత్రీకరించేటప్పుడు ఆడవారి పట్ల గౌరవంతో వారి పాదాలు పట్టుకుంటానని తెలిపారు. దృశ్యం చిత్రంలోని వీరభద్ర పాత్ర గురించి, విలన్ పాత్రలు తనలోని చెడును బయటపెట్టి..

Ravi Kale: ఆ క్యారెక్టర్ వల్ల రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు.. వాళ్లు ఎంత డేంజర్ అంటే..
Ravi Kale
Ravi Kiran
|

Updated on: Jan 29, 2026 | 2:07 PM

Share

క్యారెక్టర్ ఆర్టిస్టు రవి కాలే ఇటీవల ఓ ఇంటర్వ్యూ తన కెరీర్ ఒడిదుడుకులు, ముఖ్యంగా దండుపాళ్యం సిరీస్‌లో పోషించిన క్రూరమైన పాత్రలు, వాటి ప్రభావం గురించి వివరంగా చెప్పారు. ఈ సిరీస్ నాలుగు భాగాల వరకు సాగిందని, చివరికి దర్శకులను ఆ పాత్రలను ఆపమని రిక్వెస్ట్ చేశానని ఆయన వెల్లడించారు. ఒక నటుడిగా పాత్ర డిమాండ్ చేసినా, వ్యక్తిగతంగా అలాంటి క్రూరమైన సీన్స్ తనను మానసికంగా బాగా వేధించేవని, రాత్రి నిద్ర పట్టని సందర్భాలు కూడా ఉండేవని ఆయన వివరించారు.

ఇది చదవండి: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..

ప్రత్యేకించి, మహిళలపై దారుణంగా ప్రవర్తించే సీన్స్ చిత్రీకరించేటప్పుడు రవి కాలే ఒక ప్రత్యేకమైన పద్ధతిని పాటిస్తారట. నటనకు ముందు, తాను హింసించాల్సి వచ్చిన సహనటి పాదాలపై పడి క్షమాపణ కోరుతానని ఆయన తెలిపారు. ఇది తన వ్యక్తిగత అలవాటు అని, ఆ నటిని గౌరవిస్తూ, అది కేవలం నటనలో భాగం అని చెప్పడం ద్వారా వారికి ధైర్యాన్ని ఇస్తానని అన్నారు. తద్వారా ఆ నటి భయం లేకుండా నటించగలుగుతుందని, సీన్ సహజంగా వస్తుందని ఆయన నమ్మకం. కొన్నిసార్లు అనుకోకుండా శారీరక స్పర్శ తగిలే అవకాశం ఉన్నందున, అలాంటి సందర్భాలకు కూడా ముందే క్షమాపణలు చెబుతానని రవి కాలే పేర్కొన్నారు. నటన తన జీవితంలో దైవంతో సమానమని, అందుకే ఎంతటి కష్టమైన పాత్రనైనా దైవ ఆదేశంగా భావించి చేస్తానని ఆయన చెప్పారు. దండుపాళ్యం సినిమా కోసం రియల్ గ్యాంగ్‌ను జైలులో కలిశానని.. వాళ్లు చాలా డేంజర్ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

దృశ్యం చిత్రంలోని వీరభద్ర పాత్ర గురించి మాట్లాడుతూ, అది తనకు ఎంతో ప్రత్యేకమైనదని రవి కాలే తెలిపారు. ఆ పాత్ర ఒక స్లో పాయిజన్ లాగా నెమ్మదిగా మొదలై, చివరికి భయంకరంగా మారే తీరును ఆయన వివరించారు. చిన్న పాపను కొట్టే సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు నటుడిగా నటించినా, వ్యక్తిగతంగా ఎంతో బాధపడ్డానని ఆయన అన్నారు. ఆ సన్నివేశంలో వెంకటేష్, ఆయన భార్య, చివరికి ఆ పాపను కూడా హింసించిన తీరు ప్రేక్షకులను తీవ్రంగా ప్రభావితం చేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు. థియేటర్లలో తన పాత్రను చూసి ప్రేక్షకులు తిట్టినప్పుడు, అది తన నటనకు లభించిన అవార్డుగా భావించానని చెప్పారు.

ఇది చదవండి: జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది అతడే..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..