నీలి రంగు డ్రెస్‌లో క్యూట్‌గా.. మృణాల్ బ్యూటిఫుల్ ఫొటోస్
Samatha
28 January 2026
అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
మృణాల్ ఠాకూర్
ఈ చిన్నది సీతా రామం అనే మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో సీత పాత్రలో నటించి, టాలీవుడ్ అభిమానుల మనసు గెలుచుకుంది.
సీతా రామం
సీతా రామం మూవీ తర్వాత ఈ బ్యూటీకి వరసగా అవకాశాలు రావడంతో, ఏ సినిమాను మిస్ చేసుకోకుండా, ప్రతి సినిమాలో నటించి మెప్పించింది.
వరస అవకాశాలు
కానీ మంచి హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది. ఈ అమ్మడు చేసిన చాలా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయినా ఈ అమ్మడుకు మాత్రం అవకాశాలు తగ్గలేదు.
డిజాస్టర్స్ ఎక్కువ
ప్రస్తుతం ఈ చిన్నది యంగ్ హీరో అడవి శేషు సరసన, డెకాయిట్ అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ఈ మూవీ అయినా మంచి హిట్ ఇస్తుందో చూడాలి.
అడవి శేషు సరసన
అలాగే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో వచ్చే సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పెద్ది మూవీలో సాంగ్ చేస్తున్నట్లు టాక్.
స్పెషల్ సాంగ్
ఇక వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.
సోషల్ మీడియా
తాజాగా ఈ చిన్నది బ్లూ కలర్ డ్రెస్‌లో సింపుల్ లుక్‌లో కనిపించి, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.