AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Long Toes Meaning: కాలు వేళ్లు పొడవుగా ఉన్నాయా..? వీరంతా అదృష్టవంతులే..!

Toe Length Astrology: కొంతమందికి భిన్నంగా కొన్ని వేళ్లు పొడవుగా పెరుగుతాయి. కాలు రెండవ వేలు ముఖ్యంగా బొటనవేలు పక్కన ఉన్న వేలు పొడవుగా ఉంటే.. దాని వెనక ఒక ప్రత్యేక రహస్యం దాగి ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. బొటనవేలు పక్కన బొటనవేలు ఉన్న వ్యక్తులు ప్రత్యేక స్వభావాన్ని, జీవనశైలిని కలిగి ఉంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Long Toes Meaning: కాలు వేళ్లు పొడవుగా ఉన్నాయా..? వీరంతా అదృష్టవంతులే..!
Feet Fingers
Rajashekher G
|

Updated on: Jan 29, 2026 | 1:40 PM

Share

Long Toes Lucky: హిందూ మతంలో అనేక శాస్త్రాలు ఉన్నాయి. జ్యోతిష్యశాస్త్రం, శకునశాస్త్రం, వాస్తు ఇలా ప్రతి విషయానికి ఓ శాస్త్రం ఉంది. అలాగే మన శరీర భాగాలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచాన వేసే శాస్త్రం కూడా ఉంది. ఆ శాస్త్రం ప్రకారం.. శరీర భాగాల నిర్మాణం, ఆకృతి ఆధారంగా ఒక వ్యక్తి స్వభావం, ఇతర విషయాల గురించి తెలుసుకోవచ్చు. ప్రపంచంలో చాలా మంది సాధారణ వేళ్ల పొడవు ఉంటుంది. కానీ, కొంతమందికి భిన్నంగా కొన్ని వేళ్లు పొడవుగా పెరుగుతాయి. కాలు రెండవ వేలు ముఖ్యంగా బొటనవేలు పక్కన ఉన్న వేలు పొడవుగా ఉంటే.. దాని వెనక ఒక ప్రత్యేక రహస్యం దాగి ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. బొటనవేలు పక్కన బొటనవేలు ఉన్న వ్యక్తులు ప్రత్యేక స్వభావాన్ని, జీవనశైలిని కలిగి ఉంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

వీరంతా అదృష్టవంతులే..

స్త్రీ అయినా.. పురుషుడైనా బొటనవేలి పక్కన ఉండే వేలు పెద్దదిగా, పొడవుగా ఉంటే.. వారు అదృష్టవంతులుగా భావిస్తారు. వారి ముఖ కవళికలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇతరులను తమవైపునకు తిప్పుకుంటే ప్రత్యేక ఆకర్షణ వారికి ఉంటుంది.

స్త్రీ కాలి రెండవ వేలు పొడవుగా ఉంటే.. ఆమె తన భర్తను చాలా ప్రేమిస్తుంది. అయితే, వారు తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తపర్చలేరు. ఈ మహిళలకు కోపం బాహ్యంగా మాత్రమే ఉంటుంది. లోపల మాత్రం ఎలాంటి ద్వేషం ఉండదు.

విజయం ఖాయం..

ఇలాంటి వారి జీవితం ప్రారంభంలో పోరాటాలతో నిండి ఉంటుంది. కానీ, కష్టపడి పనిచేయడం, కృషి చేసి ఖచ్ఛితంగా విజయం సాధిస్తారు. ఈ వ్యక్తులు కష్టపడి పనిచేసేవారిగా, శక్తివంతులుగా ఉంటారు. పనిలో చాలా అంకిత భావం కలిగి ఉంటారు. వారు ఏ పని మొదలుపెట్టినా.. దానిని పూర్తి చేసిన తర్వాతే విశ్రాంతి తీసుకుంటారు.

ఈ సంకేతాలు కూడా కావచ్చు

అయితే, కొందరికి ఈ వేలు చాలా పొడవుగా ఉంటే.. సోమరితనానికి సంకేతం కూడా కావచ్చు. వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఎవరైనా తమను ఆపితే వారు సహించలేరు. ఆర్థికంగా వీరికి కలిసివస్తుంది. కానీ, వీరికి విజయం 35-40 సంవత్సరాల తర్వాతే ఎక్కువగా కనిపిస్తుంది. వీరు మృదువైన హృదయాలను కలిగి ఉంటారు. ఎవరైనా కఠినంగా మాట్లాడినా శాంతంగా తీసుకుంటారు. తమ పనిలో ఎక్కువగా బిజీ ఉండటం వల్ల వీరికి ఎక్కువగా స్నేహితులు ఉండరు.

(Declaimer: ఈ వార్తలోని సమాచారాన్ని మత సంబంధమైన అంశాలు, అందుబాటులో ఉన్న వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)