Prabhas: ప్రభాస్ పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్యామలాదేవి.. త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నారట..

ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం. అయితే బాహుబలి సినిమా టైమ్ నుంచి డార్లింగ్ పెళ్లి కబురు కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అప్పట్లో ఇదే విషయంపై ప్రభాస్ ను అడగ్గా.. బాహుబలి తర్వాత అన్నారు. కానీ ఈ మూవీ విడుదలైన సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ డార్లింగ్ మాత్రం తన పెళ్లి గురించి నోరువిప్పడం లేదు. తాజాగా ప్రభాస్ పెళ్లి పై ఆయన పెద్దమ్మ దివంగత హీరో కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి స్పందించారు.

Prabhas: ప్రభాస్ పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్యామలాదేవి.. త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నారట..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 17, 2023 | 8:15 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఓవైపు అభిమానులు తమ ఫేవరేట్ స్టార్ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. డార్లింగ్ మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం. అయితే బాహుబలి సినిమా టైమ్ నుంచి డార్లింగ్ పెళ్లి కబురు కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అప్పట్లో ఇదే విషయంపై ప్రభాస్ ను అడగ్గా.. బాహుబలి తర్వాత అన్నారు. కానీ ఈ మూవీ విడుదలైన సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ డార్లింగ్ మాత్రం తన పెళ్లి గురించి నోరువిప్పడం లేదు. తాజాగా ప్రభాస్ పెళ్లి పై ఆయన పెద్దమ్మ దివంగత హీరో కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి స్పందించారు.

దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు శ్యామలాదేవి.ఈ క్రమంలోనే ఆమె మీడియాతో మాట్లాడారు. కృష్ణంరాజు తమతో లేకపోయినా ఆయన పేరు నిలబెడుతూ తమ ఫ్యామిలీ ముందుకు వెళ్తోందన్నారు. ఇక ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. త్వరలోనే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని.. అమ్మాయి ఎవరు ? డేట్ ఎప్పుడు అనేది తెలియదు? కానీ ఆరోజు త్వరలోనే ఉంటుందని స్పష్టం చేసారు. వచ్చే దసరా నాటికి ఫ్రభాస్ ఓ ఇంటివాడిగా ఉంటాడని శ్యామలా దేవి అన్నారు. ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తిర విషయం బయటకు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సలార్, కల్కి చిత్రాల చిత్రీకరణలో బిజీగా ఉన్నారు ప్రభాస్. గతంలో ఆదిపురుష్ సినిమా విడుదల సమయంలో డార్లింగ్ ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ తో ప్రేమలో ఉన్నారంటూ టాక్ నడిచింది. అయితే ఈ రూమర్స్ పై కృతి సనన్ క్లారిటీ ఇచ్చింది. అంతకు ముందు ప్రభాస్ పెళ్లి గురించి అనేక రకాల రూమర్స్ నెట్టింట వైరల్ కాగా.. గతంలోనే ఖండించారు శ్యామలాదేవి. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర విషయం పంచుకున్నారు.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.