ఆ హీరో ఎందుకూ పనికిరాడని వాళ్ల నాన్న తెగ బాధపడ్డాడు.. ఇంతకీ అతను ఎవరంటే
తెలుగులో 12వందలకు పైగా సినిమాల్లో పలురకాల పాత్రల్లో నటించి మెప్పించాడు నటుడు చలపతిరావు. విలన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే తెలుగులో దాదాపు అందరు హీరోల సినిమాల్లో నటించారు. సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరి సినిమాలో చేశారు చలపతి రావు.

తన విలక్షణ నటనతో ఎంతో మంచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సీనియర్ నటుడు చలపతి రావు. విలన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలో పోషిచారు చలపతి రావు. ముఖ్యంగా తండ్రి పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. చలపతిరావు పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు రకాలైన పాత్రల్లో నటించి మెప్పించారు. 1966లో విడుదలైన గూఢచారి 116 సినిమాతో ఆయన చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాడు. కాగా తన చివరి చిత్రం 2021లో విడుదలైన బంగార్రాజు. తెలుగులో దాదాపు అందరు హీరోల సినిమాల్లో నటించారు చలపతిరావు. అంతే కాదు ఎంతో మంది హీరోలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది.
కాగా గాంతంలో చలపతిరావు ఓ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఓ హీరో ఎందుకూ పనికిరాకుండా పోతాడని అతని తండ్రి బాధపడ్డాడు అని అన్నారు చలపతి రావు. చలపతి రావు కొడుకు రవిబాబు నటుడు, దర్శకుడు ఈ విషయం అందరికి తెలిసిందే. చలపతి రావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అల్లరి సినిమా గురించి చెప్పారు. రవిబాబు వచ్చి అల్లరి సినిమా గురించి చెప్పాడు.
అప్పుడు నేను హీరోగా ఎవరిని అనుకుంటున్నావు అని అడిగితే ఈవీవీ సత్యనారాయణ గారి రెండో అబ్బాయి అని అన్నాడు నేను ఆశ్చర్యపోయా.. ఎందుకంటే ఈవీవీ గారు నాతో ఎప్పుడు నరేష్ గురించి చెప్తూ ఉంటారు. వీడిని ఎదో ఒకటి చేయాలి ఎందుకూ పనికి రాకుండా పోతాడేమో అనిపిస్తుంది. యాక్టర్ గా పనికిరాడు అని బాధపడేవారు. అలాంటిది రవిబాబు నరేష్ హీరో అనగానే నేను షాక్.. కథకు అతను సెట్ అవుతాడు అని రవిబాబు నన్ను ఒప్పించాడు. సరే అని నేను ఈవీవీ గారిని అడిగాను. ఆయన ముందు నేను జోక్ చేస్తున్నా అనుకున్నాడు. ఫైనల్ గా ఒప్పుకున్నాడు. ఆతర్వాత సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది అని అన్నారు. ఇక నరేష్ విషయానికొస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నరేష్. కామెడీ సినిమాలతో పాటు సీరియస్ యాక్షన్ సినిమాలు కూడా చేసి మెప్పిస్తున్నాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి