రియల్ తండేల్ రాజు ఇతనే.. కథ వింటే కన్నీళ్లాగవు

రియల్ తండేల్ రాజు ఇతనే.. కథ వింటే కన్నీళ్లాగవు

Phani CH

|

Updated on: Feb 05, 2025 | 1:52 PM

లవ్ స్టోరీ తర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం తండేల్. కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కించాడు. బన్నీ వాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అన్ని హంగులు, కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తండేల్ ఫిబ్రవరి 07న విడుదల కానుంది.

ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య తండేల్ రాజ్‌ అనే మత్స్యకారుని పాత్రలో కనిపించనున్నాడు. మత్స్యకారుల నేపథ్యంలో కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కొందరు భారత జాలర్లు పొరపాటున పాక్‌ భూభాగంలోకి వెళ్లడం, పాక్ కోస్ట్ గార్డ్స్ వారిని అదుపులోకి తీసుకోవడం తదితర పరిణామాల నేపథ్యంలో తండేల్ మూవీని తెరకెక్కించారు. ఇక ఈ ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రియల్ తండేల్ రాజ్ తండేల్ రామారావు హాజరయ్యారు. తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను రామారావు వివరించారు. అలాగే పాకిస్తాన్ జైలులో ఎలాంటి కష్టాలు పడ్డారనే విషయాలను గుర్తు చేసుకున్నారు. తండేల్ అంటే లీడర్ అని అర్థం. మిగతా జాలరులు అందరూ తండేల్ ను అనుసరిస్తారు. ఎన్ని ఎక్కువ చేపలు పడితే అంత పేరు వస్తుంది. వేటకు వెళ్లేముందు ఇదే లాస్ట్ ట్రిప్ అని తన భార్యకు చెప్పి వెళ్లాను అంటూ తన స్టోరీ మొదలెట్టిన రామారావు.. అప్పుడు తన భార్య ఏడు నెలల గర్భంతో ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు. 29 రోజులు సముద్రంలో వేట బాగానే సాగింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అవును.. అలా పెట్టడం నా తప్పేనండీ.. క్షమించండి..

సినిమా సెట్ లోకి గ్రాండ్ వెల్ కం.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న జానీ

ఐకాన్ స్టార్‌తో.. మహా కుంభమేళా బ్యూటీ మోనాలిసా

సినిమాకు రూ.21 కోట్లు.. కనీసం వాచ్ మెన్‌ను పెట్టుకోలేరా ??

ఆరాధ్యపై ఫేక్ న్యూస్.. ఐశ్వర్య సీరియస్‌ యాక్షన్‌