
దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం (ఆగస్టు 16) చాలా మంది తల్లి దండ్రులు తమ బిడ్డలను చిన్ని కృష్ణులుగా, గోపికలుగా ముస్తాబు చేశారు. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగమయ్యారు. తమ పిల్లలను చిన్ని కృష్ణుడు, గోపికలుగా రెడీ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట బాగా వైరలయ్యాయి. పై ఫొటో కూడా అదే. అందులో క్యూట్ గా కనిపిస్తున్న కృష్ణుడు, గోపికలు ఎవరో తెలుసా? ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన ఒక స్టార్ హీరో పిల్లలే వీళ్లు. ఇదే సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడీ హీరో. ఇప్పుడు ఇదే పాన్ ఇండియా మూవీకి ప్రీక్వెల్ తీస్తూ బిజీగా ఉంటున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ పిల్లలు మరెవరో కాదు కాంతార సినిమాతో సంచలన విజయం సాధించిన కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి పిల్లలు.
రిషభ్ శెట్టి 2017లో ప్రగతి శెట్టి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.. కుమారుడు రణ్ విత్, కుమార్తె రాధ ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండే రిషబ్ తన ఫ్యామిలీ ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ప్రతి పండక్కి తన భార్య, పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంటాడు. అలా తాజాగా కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తన కుమారుడు రన్విత్ శెట్టిని ఇలా చిన్ని కృష్ణుడిగా తయారుచేశారు. అలాగే కూతురు రాధ్య శెట్టిని గోపికలా ముస్తాబు చేశారు. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట తైగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా రిషబ్ ఫ్యాన్స్ ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. వీటిని చూసిన నెటిజన్లు పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారంటూ కాంప్లిమెంట్స్ అందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.