Murari: మురారి కథ ఎలా వచ్చిందంటే.. అసలు విషయం చెప్పిన కృష్ణవంశీ.. వింటే షాక్ అవుతారు

సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయ్యారు. అయితే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో  సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే మహేష్ బర్త్ డే గిఫ్ట్ గా ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు కానీ రాజమౌళి మూవీ అప్డేట్ రాకపోవచ్చు అని తెలుస్తోంది. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. కానీ ఇప్పుడు మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ మురారి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

Murari: మురారి కథ ఎలా వచ్చిందంటే.. అసలు విషయం చెప్పిన కృష్ణవంశీ.. వింటే షాక్ అవుతారు
Murari
Follow us

|

Updated on: Jul 23, 2024 | 4:52 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డేకు సంబరాలు చేసుకోవడానికే అభిమానులు రెడీ అవుతున్నారు. ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజును ఘనంగా చేసుకోవడానికి ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసేశారు ఫ్యాన్స్. సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయ్యారు. అయితే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే మహేష్ బర్త్ డే గిఫ్ట్‌గా ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు కానీ రాజమౌళి మూవీ అప్డేట్ రాకపోవచ్చు అని తెలుస్తోంది. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. కానీ ఇప్పుడు మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ మురారి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. థియేటర్స్ లో మరోసారి మురారి సినిమాను ఎంజాయ్ చేయడానికి ఫాన్స్ రెడీ అయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మురారి సినిమా సీన్స్ , ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

ఇదికూడా చదవండి : అనుపమ, బెల్లంకొండ మధ్యలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుందా.? ఇప్పుడు చూస్తే అమ్మబాబోయ్ అనాల్సిందే

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమా మంచి విజయన్ని అందుకుంది. ఈ సినిమాతో సోనాలి బింద్రే హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. అయితే ఈ సినిమా బ్యాక్ స్టోరీ గురించి కృష్ణవంశీ ఆసక్తికర విషయం  తెలిపారు. గతంలో కృష్ణవంశీ మాట్లాడుతూ..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో ఊహించని ఎంట్రీ.. హౌస్‌లో అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..!

తెన్నేటి హేమలత అనే రైటర్ ఉన్నారు. ఆమె రాసిన మోహన వంశీ అనే కథ నన్ను ఆకట్టుకుంది. కృష్ణుడు బృందావనంలో ఉండే పార్ట్ వరకే కథగా రాసింది ఆమె.. ఆ బుక్ గుర్తుకు వచ్చింది. చేస్తే ఆ బృందావనం బ్యాక్ డ్రాప్ తో సినిమా చేయాలి అని అనుకున్నా.. బృందావనం, గొల్లభామలు, పచ్చదనం, కృష్ణుడు ఇలా అందంగా తీయాలని అనుకున్నా.. ఆ తర్వాత పోతన భాగవతం చదివి కృష్ణుడి గురించి తెలుసుకున్నా.. ఆతర్వాత నేను గోదావరి జిల్లాల్లో తిరుగుతూ ఉన్నాను. కారులో తిరుగుతూ ఉండగా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ.. ఇలా ఇందిరాగాంధీ ఫ్యామిలీకి ఎదో శాపం ఉందని మాట్లాడారు.. ఆ ఫ్యామిలీలో అన్ని వరుస మరణాలు, బలన్మరణాలు అని చెప్పారు. ఆతర్వాత ఓ పెద్ద ఎంపీగారు.. ఆయనకు ఇద్దరో ముగ్గురో కొడుకులు ఉన్నారు. వాళ్లు మూడు నెలల గ్యాప్ లో చనిపోయారు. కారణం ఏంటి అంటే ఆ ఇంటి పనిమనిషి శాపం అని అన్నారు. దాంతో ఈ శాపం కాన్సెప్ట్ వచ్చింది. అలాగే శ్రీ కృష్ణుడి కథలో కూడా అదే కదా.. ఏడుగురు చనిపోయిన తర్వాత ఎనిమిదో వాడిగా పుట్టాడుగా కృష్ణుడు.. వాటిని లింక్ చేస్తూ కథను రాసుకున్నా.. అలా మురారి సినిమా వచ్చింది అని తెలిపాడు కృష్ణ వంశీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.