13మందితో ఎఫైర్స్.. ఇప్పటికీ సింగిల్‌గానే.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..!

ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా 13మందితో ఎఫైర్ పెట్టుకుంది. ఓ హీరోతో డేటింగ్ చేస్తుంది అని వార్తలు వచ్చే లోగా అతనితో విడిపోయి మరొకరితో రిలేషన్ లో ఉంది అంటూ కొత్త వార్త పుట్టుకొచ్చేది. ఇలా ఆమె ఏకంగా 13మందితో ఎఫైర్ పెట్టుకుంది. ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. తనకంటే చిన్న వాడితో డేటింగ్ చేసింది.. అలాగే వయసులో తనకంటే చాలా పెద్దవాడితోనూ డేటింగ్ చేసింది.

13మందితో ఎఫైర్స్.. ఇప్పటికీ సింగిల్‌గానే.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..!
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 22, 2024 | 5:42 PM

సినిమా ఇండస్ట్రీలో లవ్ స్టోరీలు, బ్రేకప్స్, పెళ్లిళ్లకు, విడాకులు ఇవన్నీ చాలా కామన్ గా కనిపిస్తూ.. వినిపిస్తూ.. ఉంటాయి. అలాగే లవ్ ఎఫైర్స్, డేటింగ్స్ కూడా ఎక్కువే.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ , హీరోలు డేటింగ్ చేసుకొని ఆయా తర్వాత విడిపోయారు కూడా.. అయితే ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా 13మందితో ఎఫైర్ పెట్టుకుంది. ఓ హీరోతో డేటింగ్ చేస్తుంది అని వార్తలు వచ్చే‌‌లోగా.. అతనితో విడిపోయి మరొకరితో రిలేషన్ లో ఉంది అంటూ కొత్త వార్త పుట్టుకొచ్చేది. ఇలా ఆమె ఏకంగా 13మందితో ఎఫైర్ పెట్టుకుంది. ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. తనకంటే చిన్న వాడితో డేటింగ్ చేసింది.. అలాగే వయసులో తనకంటే చాలా పెద్దవాడితోనూ డేటింగ్ చేసింది. కానీ ఈ అమ్మడికి అవేమి కలిసి రాలేదు. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

ఎప్పుడూ బాలీవుడ్ వుడ్ లో ఈ అమ్మడి ప్రేమాయణం న్యూస్ గా మారుతూ ఉంటుంది. ఇంతకూ ఆమె ఎవరంటే మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్‌. మొన్నటివరకు తనకన్నా చిన్నవాడైన రోహ్మన్‌ షాల్‌ తో రిలేషన్ లో ఉంది ఈ బ్యూటీ. ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆతర్వాత అతనితో విడిపోయింది. అలాగే ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీతో ప్రేమలో పడింది. ఆయనతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆతర్వాత ఆమె అతని నుంచి కూడా విడిపోయింది. తిరిగి పాత బాయ్ ఫ్రెండ్ రోహ్మన్‌ షాల్‌తో కనిపించి షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది ఈ అమ్మడు. సుస్మితా సేన్‌కి ఇప్పటివరకు 13 లవ్ ఎఫైర్లు ఉన్నాయి. తాజాగా ఆమె పెళ్లి చేసుకోకపోవడం గురించి కామెంట్స్ చేసింది. సుష్మితా సేన్‌ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. అయితే ” నా పెద్ద కూతురు ఇప్పుడు పెళ్లి చేసుకోవద్దు అంటుంది. ఇలానే హ్యాపీగా ఉంది” అని అంటుందని అందుకే తాను పెళ్లి చేసుకోవడంలేదు అని తెలిపింది. కాగా ఆమె లవ్ ఎఫైర్స్ బాలీవుడ్ లో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇక సుష్మితా సేన్‌ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఇటీవలే ఓ వెబ్ సిరీస్ లో నటించింది. కాగా సుష్మితా సేన్‌ తెలుగులోనూ నటించారు. కింగ్ నాగార్జున హీరోగా చేసిన రక్షకుడు అనే సినిమా చేసింది.

సుష్మితసేన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

సుష్మితసేన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.