Telangana Elections 2023: టాలీవుడ్ స్టార్స్ ఓటు వేసేది ఎక్కడో తెలుసా ?.. ప్రభాస్, అల్లు అర్జున్ అంతా అక్కడే..
ఇక తెలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోస్, ప్రముఖులు సైతం విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. సినీతారలు ఎక్కువగా జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ ఏరియాల్లో సమీపంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయనున్నారు. అయితే హైదరాబాద్లో ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు సహా మిగతా స్టార్ నటీనటులు ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారో తెలుసుకుందామా.

తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ రేపు (నవంబర్ 30)న జరగనున్నాయి. నిన్నటితో (నవంబర్ 28)తో ఎన్నికల ప్రచారానికి సమయం ముగియడంతో ఎన్నికల సంఘం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఎలక్షన్ పోలింగ్ బూత్ వద్ద భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇటు రాష్ట్రంలో రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి నగరంలో ఉన్న ప్రజలు తమ సొంతూర్లకు ప్రయాణమవుతున్నారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకే దూర ప్రాంతాల్లో ఉన్నవారు సైతం ఓటు వేయడానికి తమ సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. ఇక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా ఏర్పాట్లు సిద్ధం చేశారు అధికారులు. ఇక తెలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోస్, ప్రముఖులు సైతం విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. సినీతారలు ఎక్కువగా జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ ఏరియాల్లో సమీపంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయనున్నారు. అయితే హైదరాబాద్లో ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు సహా మిగతా స్టార్ నటీనటులు ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారో తెలుసుకుందామా.
జూబ్లీహిల్స్ క్లబ్.. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన, రామ్ చరణ్, నితిన్
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్.. మహేష్ బాబు, నమ్రత, మంచు మోహన్ బాబు, విష్ణు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్.
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్.. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్
ఎఫ్ఎన్సీసీ.. రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్, దగ్గుబాటి రానా, సురేష్ బాబు, విశ్వక్ సేన్
ఎమ్మెల్యే కాలనీ.. రవితేజ.
ఓబుల్ రెడ్డి స్కూల్.. జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి.
బీఎస్ఎన్ఎల్ సెంటర్.. అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్.
వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్.. నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్
మణికొండ.. ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం.
జూబ్లీహిల్స్ ఆర్థిక సహకార సంస్థ.. అల్లరి నరేష్.
యూసఫ్ గూడ చెక్ పోస్ట్ ప్రభుత్వ పాఠశాల.. తనికెళ్ల భరణి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.