
మీకు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూడడం అంటే ఇష్టమా.. ? అయితే మీరు ఇప్పుడు ఈ మూవీ గురించి తెలుసుకోవాల్సిందే.. భవిష్యత్ గందరగోళంతో చుట్టబడిన ఓ రహస్య కథ .. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులకు ప్రతి క్షణం సైన్స్, ఉత్కంఠను కలిసే ప్రపంచంలోకి లాగుతుంది. హై-ఆక్టేన్ విజువల్స్, ఆకర్షణీయమైన కథనంతో నిండిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డైలాగ్స్, విజువల్స్ మీకు మరింత ఆసక్తిని కలిగించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. మనసును కదిలించే సన్నివేశాలు, భావోద్వేగలతో కూడిన ఈ సినిమా ఆద్యంతం జనాలను కట్టిపడేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కేవలం పన్నెండు రోజుల్లోనే రూ.4500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ తిరగరాసింది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ?
2025లో భారీ విజయాన్ని అందుకున్న ఆ సినిమా మరెదో కాదు.. ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ జురాసిక్ సిరీస్‌లో ఏడవ చిత్రం. గత 22 సంవత్సరాలుగా డైనోసార్ల ప్రపంచం ప్రేక్షకుల హృదయాలను గెలుస్తుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాని బడ్జెట్ కంటే మూడు రెట్లు కలెక్షన్స్ రాబట్టింది. ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ భారతీయ థియేటర్లలో బ్లాక్ బస్టర్ ప్రారంభం అయింది. ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే రూ. 86 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద తుఫాన్ క్రియేట్ చేస్తుంది.
ఇందులో ప్రముఖ నటి స్కార్లెట్ జోహన్సన్, ఎమ్మీ, SAG నామినీ జోనాథన్ బెయిలీ, రెండుసార్లు ఆస్కార్ విజేత మహర్షలా అలీ ప్రధాన పాత్రల్లో నటించారు. మిషన్ ఇంపాజిబుల్- ది ఫైనల్ రికనింగ్ తర్వాత ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న రెండవ సినిమాగా నిలిచింది. జూలై 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై దాదాపు రూ.4500 కోట్లు వసూలు చేసింది.ఈ చిత్రం బడ్జెట్ రూ.1541 కోట్లు అని సమాచారం.
ఇవి కూడా చదవండి :
Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?
Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..