AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సూర్య, ఎన్టీఆర్‏లకు లక్కీ ఛార్మ్.. తెలుగు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

దాదాపు 13 ఏళ్ల క్రితం సౌత్ ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్. తక్కువ సమయంలోనే అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా దక్షిణాది హీరోలకు లక్కీ ఛార్మ్ ఆ హీరోయిన్. హిట్లు లేకపోయినా ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఆమె.. ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Tollywood: సూర్య, ఎన్టీఆర్‏లకు లక్కీ ఛార్మ్.. తెలుగు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
Sameera Reddy
Rajitha Chanti
|

Updated on: Apr 27, 2026 | 4:33 PM

Share

సాధారణంగా సినీరంగంలో అంతగా హిట్లు లేకపోయినా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుని తమదైన ముద్రవేశారు పలువురు తారలు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. సౌత్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు దాదాపు 13 ఏళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ సమీరా రెడ్డి. 2002లో విడుదలైన మైనే దిల్ తుజ్కో దియా చిత్రంతో హిందీ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో వరుస అవకాశాలు అందుకుంది. 2005లో ఎన్టీఆర్ జోడిగా నరసింహుడు మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ అంతగా హిట్ కాకపోయిన అందం, అభినయంతో కట్టిపడేసింది సమీరా రెడ్డి.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

హిందీ, తెలుగు, బెంగాలీ చిత్రాలలో నటించిన సమీరా రెడ్డి, 2009లో గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా నటించిన ‘వారణం ఆయిరం’ చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రానికిగాను ఆమె ఉత్తమ తొలి పరిచయ నటిగా విజయ్ అవార్డును గెలుచుకున్నారు. సమీరా రెడ్డి ఆ తర్వాత అజిత్ సరసన శరణ్ దర్శకత్వంలో ‘అజల్’ చిత్రంలో నటించింది. మోహన్‌లాల్ నటించిన ‘ఒరు నాల్ వరుమ్’ చిత్రంతో సమీరా రెడ్డి మలయాళంలో నటిగా రంగప్రవేశం చేసింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడిగా జై చిరంజీవా మూవీలో కనిపించింది. కానీ ఆమె ఎక్కువగా తమిళం, మలయాళం భాషలలో నటించింది. ఎన్టీఆర్ సరసన నరసింహుడు తర్వాత అశోక్ సినిమాలో నటించింది.

ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..

2014లో అక్షయ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సమీరా రెడ్డి.. ఆ తర్వాత పూర్తిగాసినిమాలకు దూరమయ్యింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చాలా కాలంగా సమీరా రెడ్డి అటు కుటుంబాన్ని చూసుకుంటూ ఇటు సోషల్ మీడియాలో తన ఫిట్నెస్, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు పంచుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత, సంజయ్ దత్ హీరోగా నటిస్తున్న ‘ఆగ్రి సావల్’ చిత్రంలో సమీరా రెడ్డి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో త్రితా చౌదరి, అమిత్‌సాద్, నమశీ చక్రవర్తి, మృణాల్ కులకర్ణి కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి అభిజీత్ మోహన్ వరాంగ్ దర్శకత్వం వహించారు.

ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..

సమీరా రెడ్డి ఇన్ స్టా పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..

Follow Us