AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lagaan Movie: ఆమిర్ ఖాన్ ‘లగాన్’లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందో చూస్తే స్టన్ అవుతారు

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇప్పుడు తన మూడో పెళ్లి విషయాలతో వార్తలతో నిలుస్తున్నారు. ఇటీవలే ఆయన గౌరీ స్ప్రాట్‌ను సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఈ వివాహంపై కొందరు రాజకీయ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Lagaan Movie: ఆమిర్ ఖాన్ 'లగాన్'లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందో చూస్తే స్టన్ అవుతారు
Lagaan Movie
Basha Shek
|

Updated on: Jul 14, 2026 | 7:07 PM

Share

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కెరీర్‌లో ‘లగాన్’ మరుపురాని చిత్రంగా మిగిలిపోయింది. రిలీజ్ కు ముందు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందో లేదో అని చాలామంది సందేహించారు. అయితే, ‘లగాన్’ బ్లాక్‌బస్టర్ అవ్వడమే కాకుండా, ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రాల జాబితాలో కూడా స్థానం సంపాదించుకుంది. అశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆమిర్ కు జోడీగా సంతోషం హీరోయిన్ గ్రేసీ సింగ్ నటించింది. వీరితో పాటు ఈ చిత్రంలోని నటీనటులందరికీ మంచి గుర్తింపు వచ్చింది. కాగా లగాన్ సినిమాతో బాగా ఫేమస్ అయిన మరో నటి రాచెల్ షెల్లీ ఒకరు. ఈ చిత్రంలో ఆమె బ్రిటిష్ రెజిమెంట్ కమాండర్ ఆండ్రూ రస్సెల్ సోదరి ఎలిజబెత్ రస్సెల్ పాత్రలో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా రాచెల్, భువన్ (ఆమిర్ ఖాన్) మధ్యలో వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఊరి ప్రజలందరూ ఆమెను ప్రేమతో ‘గోరీ మేడమ్’ అని పిలుస్తుంటారు.

తాజాగా లండన్‌లో వేదికగా’లగాన్’ సినిమా రజతోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో ఆమిర్ ఖాన్ తో సహా ఈ చిత్రంలో నటించినవారందరూ హాజరయ్యారు. గోరి మేడమ్ రాచెల్ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఆమిర్ ఖాన్ తో కలిసి సరదాగా కలిసి ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాచెల్ ఫోటోను చూసి నెటిజన్లు లైకులు, కామెంట్స్, షేర్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మా చిన్ననాటి గోరీ మేడమ్’ అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టగా, మరో యూజర్ . ‘భువన్, ఎలిజబెత్‌లు మళ్లీ కలుసుకున్నారు’ అని స్పందించాడు.

లండన్ లో ‘లగాన్’ టీమ్ రీయూనియన్..

ఇంగ్లండ్ కు చెందిన రాచెల్ ‘లగాన్’ సినిమా తర్వాత మరే భారతీయ సినిమాలోనూ నటించలేదు. అయితే ఇంగ్లిష్ సినిమాలు, సీరియల్స్ లో మాత్రం యాక్ట్ చేసింది. కాగా 2023లో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన ‘కోహ్రా’ అనే వెబ్ సిరీస్‌ లో రాచెల్ ఒక కీలక పాత్ర పోషించింది. దీని తర్వాత మరే సినిమా, వెబ్ సిరీస్ లోనూ ఆమె కనిపించలేదు.

రాచెల్ షెల్లీ లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us