Sandeep Reddy Vanga : ఇదొక అరుదైన, గొప్ప సినిమా.. మూడు గంటలు కేటాయించి తప్పక చూడండి: సందీప్ రెడ్డి వంగా
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి సాధారణంగా వేరొకరి గురించి కానీ వేరే సినిమాల గురించి కానీ పెద్దగా మాట్లాడరు. అలాంటిది ఆయన నోటి నుంచి ఒక సినిమా పేరు వచ్చిందంటే అందులో ఏదో ఒక బలమైన విషయం ఉందని అర్థం చేసుకోవచ్చు.

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయాడీ టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి స్పిరిట్ అనే హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటున్నాడు సందీప్. కాగా ఈ డైరెక్టర్ సినిమాల్లాగే ఆయన మాటలు కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గానే ఉంటాయి. ఎలాంటి ఫిల్టర్ ఉండదు. అలాంటి సందీప్ రెడ్డి వంగా తాజాగా ఓ సినిమాను చూసి ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు ఒక మూడు గంటలు ఈ సినిమా కోసం కేటాయించి తప్పక చూడాలని విజ్ఞప్తి చేశాడు. మరి సందీప్ రెడ్డి వంగాకు అంత బాగా నచ్చిన సినిమా ఏదనుకుంటున్నారా? టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా రావు బహదూర్. వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ సినిమా జులై 03న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు థియేటర్లలో మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా చాలా మంది ఆడియెన్స్ కు ఈ సినిమా సరిగా కనెక్ట్ అవ్వడం లేదు.
అయితే రావు బహదూర్ సినిమా చూసిన వారంతా సత్యదేవ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని యాక్టివ్ నెక్ట్స్ లెవెల్ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు. తాజాగా సందీప్ రెడ్డి వంగా కూడా రావు బహదూర్ సినిమాను చూశాడు. అనంతరం సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘మనం అసలు సినిమాలను ఎందుకు ప్రేమించామో గుర్తు చేసే అత్యంత అరుదైన, గొప్ప చిత్రాలలో ఇది ఒకటి. సినిమాను ప్రాణంగా ప్రేమించే ప్రతి ఒక్కరికీ నాదొక చిన్న విజ్ఞప్తి. మీ జీవితంలో ఒక మూడు గంటల సమయాన్ని ఈ సినిమా కోసం కేటాయించండి. మీ శ్రద్ధకు, మీ ఓపికకు, మీ చప్పట్లకు ఈ మూవీ ఖచ్చితంగా అర్హమైనది. పరిమిత బడ్జెట్, ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ, దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతమైన ఖచ్చితత్వంతో తెరకెక్కించారు. ఇలాంటి డిఫరెంట్ సినిమాను రూపొందించడానికి ఎంతో ధైర్యం, బలమైన నమ్మకం కావాలి. హీరో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. ఎలాంటి హడావుడి లేదు, షార్ట్‌కట్‌లు లేవు.. కేవలం ప్యూర్ ఫిల్మ్ మేకింగ్ మాత్రమే కనిపించింది. కల్తీ లేని కథాంశంతో, రాజీపడని రీతిలో సినిమాను నిర్మించిన విధానం అద్భుతం. ఇలాంటి సినిమాలను ప్రేక్షకుడు తప్పకుండా ఆదరించాలి’ అంటూ ‘రావు బహదూర్’ చిత్ర బృందం మొత్తానికి అభినందనలు తెలియజేశారు సందీప్ రెడ్డి వంగా.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ట్వీట్..
Just watched RAO BAHADUR 👏 This is one of those rare, rich films that reminds you why we fell in love with cinema in the first place 🙏
I have one request to every genuine film lover… give this film three hours of your life. It deserves your attention, your patience, and your…
— Sandeep Reddy Vanga (@imvangasandeep) July 13, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




