Gulabi Movie: గులాబి సినిమాను ఆ స్టార్ హీరో చేయాల్సిందా.. ? అసలు విషయం చెప్పిన కృష్ణవంశీ..
తెలుగు సినిమా పరిశ్రమలో విజయవంతమైన దర్శకులలో కృష్ణవంశీ ఒకరు. ఫ్యామిలీ కథా చిత్రాలతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్నారు. ఆయన సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. ప్రస్తుతం దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు. చివరగా రంగమార్తండా సినిమాను తెరకెక్కించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అప్పట్లో సంచలనం సృష్టించిన గులాబి సినిమా గురించి చెప్పుకొచ్చారు.

దర్శకుడు కృష్ణవంశీ సినిమాలకు ప్రేక్షకులలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కుటుంబ కథా చిత్రాలతో విజయాలను అందుకుని తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం సినిమాలు తగ్గించిన ఆయన.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుననారు. తన కెరీర్‌లో అత్యంత కీలకమైన గులాబి చిత్రం గురించి చెప్పుకొచ్చారు. గులాబి కేవలం ఒక చిత్రంగానే కాకుండా, తన దృష్టిలో ఒక కాంట్రాస్ట్ ఫిలిం అని అన్నారు. ఈ సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన సవాళ్లను, కథాంశం ఎలా రూపుదిద్దుకుందో వివరించారు. తొలుత యాక్షన్ చిత్రం చేయాలనే ఆలోచనతో ఉన్న కృష్ణవంశీ, ఆ తర్వాత హమ్ ఆప్కే హై కౌన్..! వంటి చిత్రాల స్ఫూర్తితో ఒక ఫ్యామిలీ డ్రామా వైపు ఎలా మళ్లారో తెలిపారు. అప్పట్లో ప్రొడ్యూసర్ తనతో ఒక లైట్ హార్టెడ్ సినిమా చేయమని అడిగారని, అయితే తాను యాక్షన్ సినిమాకే ప్రాధాన్యత ఇచ్చానని, ఆ తర్వాత కొన్ని సంఘటనల వల్ల ఫ్యామిలీ డ్రామాకు వచ్చానని కృష్ణవంశీ పేర్కొన్నారు. గులాబి చిత్రం అప్పటి సామాజిక పోకడలను, సినిమాటిక్ నమూనాలను ఎలా మార్చిందో కృష్ణవంశీ వివరించారు. అప్పటివరకు సినిమాల్లో అబ్బాయిలే అమ్మాయిల వెంట పడేవారు కాగా, గులాబిలో అమ్మాయి అబ్బాయి వెంట పడే విభిన్న ప్యాటర్న్‌ను చూపించడం ఒక పెద్ద మార్పు అని ఆయన అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..
ఇది అప్పుడు సమాజంలో ఉన్న వాస్తవమే అని, కానీ సినిమాటిక్ ప్రాతినిధ్యంలో అరుదు అని అన్నారు. మేల్ డామినేటెడ్ సొసైటీలో సినిమాలు కూడా హీరో ఓరియెంటెడ్‌గా ఉంటాయనే ధోరణిని గులాబి ప్రశ్నించిందని ఆయన అన్నారు. ఈ కథను అంగీకరించిన రాము, హీరోగా నటించిన జే. డి. చక్రవర్తి (జేడీ)లకు కృష్ణవంశీ కృతజ్ఞతలు తెలిపారు. గులాబి కథాంశానికి ప్రధాన స్ఫూర్తి 25 సంవత్సరాల క్రితం జరిగిన ఒక నిజమైన సంఘటన అని కృష్ణవంశీ వెల్లడించారు. హైదరాబాదు విమానాశ్రయంలో అభిదా నాంగియా అనే ఎయిర్ హోస్టెస్ 12 ఏళ్ల అమీనా అనే బాలికను మానవ అక్రమ రవాణా నుండి కాపాడిన సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు. ఒక 70 ఏళ్ల షేక్ ఆ బాలికను వివాహం చేసుకుని ఫ్లైట్‌లో తీసుకెళ్తున్నప్పుడు, అభిదా నాంగియాకు అనుమానం వచ్చి, ఫ్లైట్‌ను ఆపి పోలీసులకు అప్పగించి ఆ బాలికను రక్షించారు. ఈ సంఘటన అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ సంఘటన గురించి రీసెర్చ్ చేసిన కృష్ణవంశీ, అభిదా నాంగియాని హీరోగా, ఆ బాలికను హీరోయిన్‌గా ఊహించుకుని గులాబి కథను రూపొందించానని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..
వెంకటేష్‌కి గులాబి కథ చెప్పారని.. అయితే ఆయన తిరస్కరించడంతో జేడీకి ఛాన్స్ ఇచ్చారని ఉన్న పుకార్లను కృష్ణవంశీ ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవం అని ఆయన స్పష్టం చేశారు. సురేష్ బాబు తనకు సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారని, అయితే తాను కథ చెప్పలేదని అన్నారు. “సురేష్ ప్రొడక్షన్స్ అంటే మోస్ట్ ఆర్గనైజ్డ్ థింగ్ అది. ఒక ఇన్స్టిట్యూషన్. కథ చెప్తే బడ్జెట్ వేసుకుని, కొత్త డైరెక్టర్ చేయగలడా లేదా అని చూస్తారు. అందుకే కథ చెప్పను అన్నాను. నేను తీయను అన్నాను,” అని కృష్ణవంశీ అన్నారు. వెంకటేష్‌కి ఈ కథ చెప్పలేదని, ఒకవేళ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సినిమా చేస్తే, వారి హీరోనే మొదటి ప్రాధాన్యత అని, కాబట్టి ఆటోమెటిక్‌గా వెంకటేష్ హీరో అయ్యి ఉండేవారని ఆయన వివరించారు. ఇది కేవలం పుకారు మాత్రమేనని, అందులో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..
