అందాల రాక్షాసికి ఆఫర్సే కరువాయే.. మానస వారణాసి కిల్లింగ్ లుక్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

14  July 2026

భారతీయ అందాల భామ, మిస్ ఇండియా రన్నరప్ మానస వారణాసి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తుంటుంది.

తాజాగా ఆమె షేర్ చేసిన కొత్త ఫోటోషూట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో సరికొత్త లుక్‌తో మెరిసిపోతుంది. 

ఈ ఫొటోలలో మానస వారణాసి చాలా క్యూట్‌గా, ఎంతో హుందాగా కనిపిస్తోంది. పింక్ కలర్ గౌను ఆమె రూపానికి మరింత వన్నె తెచ్చిందనే చెప్పాలి.

సాధారణంగా ట్రెండీ , క్లాసిక్ దుస్తులలో కనిపించే మానస, ఈ లాంగ్ ఫ్రాక్‌లో యువరాణిలా మెరిసిపోతోంది. ఆమె చిరునవ్వు, హెయిర్ స్టైల్ కట్టిపడేస్తున్నాయి. 

అందాల పోటీలలో తనదైన ముద్ర వేసిన మానస వారణాసి, కేవలం మోడలింగ్‌లోనే కాకుండా సినిమా రంగంలోనూ రాణించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలో ఆమె షేర్ చేసే ప్రతి ఫోటోషూట్ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఈ పింక్ గౌన్ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

"పింక్ కలర్‌లో దేవకన్యలా ఉంది", "చాలా క్యూట్ లుక్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఫ్యాషన్ ప్రియులకు ఈ లుక్స్, ఆమె స్టైల్ ఎంతో నచ్చుతోంది.

దేవకీ నందన వాసుదేవ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తర్వాత తెలుగులో సంతోష్ శోభన్ సరసన కపుల్ ఫ్రెండ్లీ చిత్రంలో కనిపించింది ఈ అమ్మడు.