ఇంత టాలెంటెడ్ ఏంది సామీ.. ఈ హీరోయిన్ క్వాలిఫికేషన్స్ చూస్తే దిమాక్ కరాబ్.. ఒక్క సినిమాతోనే మాయం..
తెలుగులో ఆమె చేసింది ఒక్క సినిమానే. కానీ ఊహించనంత క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో చక్రం తిప్పుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీ నుంచి మాయమైంది. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఆమె ఎవరో తెలుసా.. ?

సాధారణంగా సినీరంగంలో నటీనటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ అంతకు ముందు వేర్వేరు రంగాల్లో స్థిరపడినవారే. డాక్టర్స్, లాయర్, బిజినెస్ ఇలా పలు రంగాల్లో తమదైన ముద్ర వేసిన తారలు.. ఇప్పుడు గ్లామర్ ప్రపంచంలో దూసుకుపోతున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకున్న తారలు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సినిమా పరిశ్రమలో మల్టీటాలెంటెడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మెడిసిన్ చదివి సినీరంగంలోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. దాదాపు 26 ఏళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. తెలుగులో ఆమె చేసింది ఒక్క సినిమానే. కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..
నిజానికి ఆమె ఓ డాక్టర్. అంతేకాదు ఫేమస్ సైకాలజిస్ట్. ఆమె పేరు అదితి గోవిత్రికర్. కానీ అందం, అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మెంటలెక్కించింది. ఒక్క సినిమాతోనే కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది. అప్పట్లో ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేది. అదితి.. ఈ పేరు చెబితే గుర్తుపట్టలేరు..కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు మూవీ సెకండ్ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఇందులో ప్రీతి జింగ్యానీ కథానాయికగా నటించగా.. సెకండ్ హీరోయిన్ గా కనిపించి ఆకట్టుకుంది అదితి.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..
మెడిసిన్ చదివి డాక్టర్, సైకాలజిస్ట్ గా వర్క్ చేసిన అదితి.. నటనపై ఆసక్తితో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు వాణిజ్య ప్రకటనలలో కనిపించింది. తెలుగులో పవన్ కళ్యాణ్ జోడిగా తమ్ముడు సినిమాలో నటించిన ఆమె ఆ తర్వాత మరో మూవీ చేయలేదు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. మిస్సెస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి ఇండియన్ మహిళగా రికార్డ్ సృష్టించింది. 2007లో తన భర్త ముఫజల్ తో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం డాక్టర్ గా రాణిస్తున్నారు అదితి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema : ఈ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ షేక్ మామ.. 30 కోట్లు పెడితే 115 కోట్ల కలెక్షన్స్..








