AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 17 ఏళ్లకే హీరోయిన్‏గా ఎంట్రీ.. శరీరంపై విమర్శలు.. ఇప్పుడు వందల కోట్లకు యాజమాని..

ఎన్నో సవాళ్లు.. మరెన్నో అవమానాలు.. అన్నింటిని అధిగమించి అందం, అభినయంతో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తారలు చాలా మంది ఉన్నారు. సినీ పరిశ్రమలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేసి చివరకు అనుకున్న గమ్యాన్ని చేరి జనాల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.

Tollywood: 17 ఏళ్లకే హీరోయిన్‏గా ఎంట్రీ.. శరీరంపై విమర్శలు.. ఇప్పుడు వందల కోట్లకు యాజమాని..
Actress
Rajitha Chanti
|

Updated on: Nov 03, 2024 | 9:41 PM

Share

సినిమా పరిశ్రమ అనేది ఓ రంగుల ప్రపంచం. ఇందులో అవకాశాలు రావడం అనేది అంత ఈజీ కాదు. వెండితెరపై మెరిసిన ఎందరో తారలు మొదట్లో ఎన్నో అవమానాలు, అడ్డంకులు, సవాళ్లను ఎదుర్కొన్నవారే. ఎన్నో కష్టాల తర్వాతే విజయాన్ని అందుకున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఒకప్పుడు సినీరంగుల లోకంలో అవమానాలను చూసిన ఆమె.. ఇప్పుడు వందల కోట్లకు మాహారాణి. కానీ కెరీర్ తొలినాళ్లల్లో ఆమె సన్నగా ఉందంటూ సినిమాల్లో నుంచి రిజెక్ట్ చేశారు మేకర్స్. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.. ? తనే బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి. ఇప్పుడు ఆమె బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. తాజా తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’తో పంచుకుంది శిల్పా శెట్టి.

శిల్పా శెట్టి మాట్లాడుతూ.. ” నేను 17 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టాను. అప్పట్లో నేను సన్నగా, పొడవుగా ఉండేదానిని. గ్రాడ్యుయేషన్ తర్వాత మా నాన్నతో కలిసి పనిచేయాలనుకున్నా. కొత్తగా ఏదైనా అవకాశం వస్తుందేమో అనుకున్నాను. సరదాగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొనడంతో పరిస్థితులు మారిపోయాయి.ఒక ఫోటోగ్రాఫర్ నన్ను ఫోటో తీయడంతో.. అలా నేను ఫ్యాషన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. ఆ తర్వాత నాకు మొదటి సినిమా అవకాశం వచ్చింది. ఫస్ట్ మూవీ తర్వాత నేను వెనుదిరిగి చూడలేదు. నేను నటిగా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు నా వయసు 17. లోకం, జీవితం గురించి పెద్దగా అవగాహన లేదు. హిందీ ఎలా మాట్లాడాలో తెలియక కెమెరా ముందు నిలబడ్డాను. కొన్ని సినిమాల తర్వాత నా కెరీర్ ముగిసే స్థాయికి వచ్చింది అనిపించింది. ఎందుకంటే నా శరీరంపై విమర్శలు చేస్తూ కొందరు నిర్మాతలు నన్ను సినిమాల నుంచి తొలగించారు” అంటూ చెప్పుకొచ్చింది.

“అలాగే నేను బిగ్ బాస్‌లో ఇతర కంటెస్టెంట్స్‌తో వివక్షకు గురయ్యానని.. కానీ ఏమాత్రం పట్టువదలకుండా ఆత్మస్థైర్యంతో ఇంతదూరం వచ్చాను.. ఇంకా ఒక్క అడుగు కూడా వెనక్కు వేయాలనుకోలేదు. కానీ నేను గెలిచిన తర్వాత ఎంతోమంది నన్ను అభినందించారు. నేను చూపిన పట్టుదల, పోరాట పటిమ నాకు విజయాన్ని అందించాయి.నా జీవితంలో ఎన్నో భయానక క్షణాలు ఉన్నాయి. కొన్నిసార్లు పెద్ద హిట్స్ అందుకున్నాను. ప్రతి నిమిషం కష్టపడ్డాను. ఆ ధైర్యమే ఈరోజు నన్ను బలమైన స్వతంత్ర మహిళగా, నటిగా, భార్యగా,తల్లిగా చేసింది” అంటూ చెప్పుకొచ్చింది.

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.