Tollywood : ఒక్క ఏడాదిలోనే 12 సినిమాలు.. అప్పట్లోనే పాన్ ఇండియా క్రేజ్.. 19 ఏళ్లకే ఊహించని మరణం..

|

Apr 07, 2025 | 7:45 AM

ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె తోపు హీరోయిన్. 14 ఏళ్లకే కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 12 సినిమాల్లో నటించింది. కానీ ఆ మరుసటి ఏడాదే ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయింది. చిరంజీవి, వెంకటేశ్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

Tollywood : ఒక్క ఏడాదిలోనే 12 సినిమాలు.. అప్పట్లోనే పాన్ ఇండియా క్రేజ్.. 19 ఏళ్లకే ఊహించని మరణం..
Divya Bharti
Follow us on

అప్పట్లోనే ఆమె పాన్ ఇండియా హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. శ్రీదేవి, మాధురీ దీక్షిత్ కూడా సాధించలేని ఘనతను ఆమె సాధించింది. ఇప్పటికీ ఆమె రికార్డును ఎవరూ బద్దలుకొట్టలేకపోయారు. ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 12 సినిమాల్లో నటించింది. అంటే నెలకు ఒక సినిమా చొప్పున షూటింగ్ చేసిందని అర్థం. 16 ఏళ్లకే ఇండస్ట్రీని ఏలేసిన ఈ హీరోయిన్.. 19 ఏళ్ల వయసులోనే ఊహించని విధంగా మరణించింది. ఆమె మరెవరో కాదు.. దివంగత హీరోయిన్ దివ్య భారతి. 14 ఏళ్ల వయసులో మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 1990లో నీలా పెన్నే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత వెంకటేశ్ నటించిన బొబ్బిలి రాజా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

1992లో విశ్వాత్మ సినిమాతో హిందీ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంది. ఒక్క ఏడాదే ఆమె నటించిన 12 సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఆమె మరణం పై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన ఏడాదికే ఆమె 1993 ఏప్రిల్ 5 తన ఇంటి బాల్కానీ నుంచి పడి మరణించింది. ఈ వార్త అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఆమె మరణించి ఇప్పటికీ 32 సంవత్సరాలు అవుతుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏడాదిలోనే ఏ హీరోయిన్ చేయలేని మ్యాజిక్ చేసింది దివ్యభారతి. ఒకే సంవత్సరంలో అత్యధిక సినిమాలను విడుదల చేసిన హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు ఏ హీరోయిన్ సైతం ఆ రికార్డ్ బద్దలు కొట్టలేకపోయింది. 1992లోనే ఆమె నటించిన 12 సినిమాలు విడుదలయ్యాయి. ఆమె మరణానికి ముందు ఆమె సంతకం చేసిన అనేక చిత్రాలకు నిర్మాతలు ప్రత్యామ్నాయ నటీమణులను ఎంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?