Tollywood: వరుసగా 4 సినిమాలు ప్లాప్.. దెబ్బకు ఇండస్ట్రీలో కనిపించకుండాపోయిన హీరోయిన్..

సినీరంగంలో కథానాయికగా నిలదొక్కుకోవాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో తమకంటూ ఓ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. మరికొందరికి మాత్రం వరుస ఆఫర్స్ అందుకున్నప్పటికీ సరైన బ్రేక్ రాలేదు.ఈ హీరోయిన్ సైతం అలాంటి జాబితాలోని అమ్మాయే.

Tollywood: వరుసగా 4 సినిమాలు ప్లాప్.. దెబ్బకు ఇండస్ట్రీలో కనిపించకుండాపోయిన హీరోయిన్..
Kavya Thapar

Updated on: Mar 15, 2025 | 10:23 AM

సాధారణంగా సినీరంగంలో స్టార్ స్టేటస్ రావాలంటే అనేక కష్టాలను ఎదుర్కొవాలి. ఎన్నో సవాళ్లను అధిగమించి ఇండస్ట్రీలో నటిగా తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ వయ్యారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. వరుస ప్లాపులు రావడంతో దెబ్బకు సినీరంగంలో కనిపించకుండా పోయింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. కావ్య థాపర్. 2018లో ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సినిమాల్లో, క్రేజీ హీరోల సినిమాల్లో నటించే అందుకుంది. ఫస్ట్ మూవీ ప్లాప్ అయినప్పటికీ ఈ బ్యూటీకి మాత్రం వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. 2021లో ఏక్ మినీ కథ సినిమాలో నటించడం ద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

ఇక హిందీలో మిడిల్ క్లా్స్ లవ్ సినిమాలో కనిపించింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో మళ్లీ సౌత్ సినిమాలపైనే దృష్టి సారించింది. తమిళంలో పిచ్చైకారన్ 2 సినిమాలో నటించింది. ఈ మూవీని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్, విశ్వం సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. రవితేజ సరసన నటించిన ఈగల్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే వరుసగా సినిమలు ప్లాప్ కావడంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి.

ఇవి కూడా చదవండి

కావ్య థాపర్ ఇప్పటివరకు ఈ ఏడాదిలో కొత్త సినిమాను ప్రకటించలేదు. ఒకే ఏడాది నాలుగు సినిమాలు ప్లాప్ కావడంతో ఈ బ్యూటీకి అంతగా ఆఫర్స్ రావడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..