Siddharth : సిద్ధార్థ్ మొదటి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ గ్యాప్లేకుండా దూసుకుపోయాడు. 2005లో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో నేరుగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు.ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ తెలుగులో స్టార్ హీరోగా మారిపోయాడు.

Siddharth : సిద్ధార్థ్ మొదటి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Siddharth
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 27, 2024 | 2:55 PM

హీరో సిద్ధార్థ్.. బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తక్కువ సమయంలో సిద్ధార్థ్ లవర్ బాయ్ ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ గ్యాప్లేకుండా దూసుకుపోయాడు. 2005లో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో నేరుగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు.ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ తెలుగులో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక్కడ క్రేజీ ఆఫర్స్ అందుకున్నాడు. చుక్కల్లో చంద్రుడు, బొమ్మరిల్లు,ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. వీటిలో బొమ్మరిల్లు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.

ఆతర్వాత ఈ క్రేజీ హీరో తమిళ్ పై ఎక్కువ ఫోకస్ చేశాడు. అక్కడ వరుసగా సినిమాలు చేశాడు.చాలా కాలం తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమాలో నటించాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. మొన్నీమధ్య చిన్న అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే సిద్ధార్థ్ పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు..

అయితే సిద్ధార్థ్ కు పెళ్ళిందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. సిద్ధార్థ్ కు 2003లో వెళ్ళింది పిల్లలు కూడా ఉన్నారు. అయితే సిద్ధర్థ్ మాత్రం ఇప్పటికీ టీనేజ్ కుర్రాడిలానే కనిపిస్తాడు. తన పక్కింట్లో ఉండే అమ్మాయినే సిద్దూ ప్రేమించి పెళ్లాడాడు. ఆమె పేరు మేఘన. న్యూఢిల్లీలో తన పొరుగింట్లో ఉంటుంది మేఘనను పెళ్లి చేసుకున్నాడు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు.అయితే మనస్పర్థల కారణంగా ఈ ఇద్దరూ విడిపోయారు. 2007 లో సిద్ధార్థ్, మేఘన విడిపోయారు. ఆతర్వాత కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్ తో సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ వీటిలో నిజం లేదు అని తేలిపోయింది. ఆతర్వాత స్టార్ హీరోయిన్ సమంతతో ప్రేమాయణం నడిపాడు. కానీ ఈ లవ్ స్టోరీ కూడా ఎక్కువ రోజులు నడవలేదు. ఇక ఇప్పుడు అధితి రావు హైదరితో ప్రేమలో ఉన్నాడు. ఈ ఇద్దరు తాజాగా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాయక స్వామి ఆలయంలో బుధవారం ఉదయం సిద్ధార్థ్, అదితిరావు హైదరీ వివాహం చాలా సింపుల్‌గా జరిగిందని తెలుస్తోంది. అదితి రావు హైదరీకి ఇది రెండో పెళ్లి కావడం విశేషం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.