Tollywood: ఈ ఫోటోలోని చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఆమె నటనకు చేతిలెత్తి మొక్కాల్సిందే..
ఒకప్పుడు అభిమానుల డ్రీమ్ బ్యూటీ. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, రాజశేఖర్, నాగార్జున, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. హీరోయిన్ గానే కాకుండా విలనిజం కూడా చూపించారు. అగ్ర కథానాయికగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమయంలోనే విలన్ పాత్రలు పోషించి రిస్క్ తీసుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

పైన ఫోటోలో ఉన్న చిన్నారి సౌత్ ఇండియా సినీ ప్రియులకు ఇష్టమైన నటి. ఎవరో ఊహించగలరా? డాన్సర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత దక్షిణాది సినిమాల్లో బలమైన నటిగా పేరు తెచ్చుకున్నారు. చిన్న వయసులోనే నటిగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో నటించి మెప్పించారు. ఆమె కళ్లతోనూ నటించగలదు. ఒకప్పుడు అభిమానుల డ్రీమ్ బ్యూటీ. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, రాజశేఖర్, నాగార్జున, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. హీరోయిన్ గానే కాకుండా విలనిజం కూడా చూపించారు. అగ్ర కథానాయికగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమయంలోనే విలన్ పాత్రలు పోషించి రిస్క్ తీసుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ చిన్నారి మరెవరో కాదు.. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.
సెప్టెంబర్ 15, 1967లో చెన్నైలో జన్మించారు రమ్యకృష్ణ. చిన్నతనం నుంచి భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నారు. 13 సంవత్సరాల వయస్సులో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. మొదట మలయాళ చిత్రం నేరమ్ పులరమండ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. కానీ మొదటి విడుదలైన సినిమా మాత్రం ‘వెల్లై మనసు’. 1985లో భలే మిత్రులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత సూత్రదారులు సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత చాలాకాలం పాటు ఆమెకు అవకాశాలు రాలేదు. ఆ తర్వాత 1992లో విడుదలైన అల్లుడుగారు సినిమా రమ్యకృష్ణ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమా తర్వాత ఆమె ఎక్కువగా డైరెక్టర్ రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమాల్లోనే నటించింది. 1990 నుంచి 2000 వరకు దాదాపు దశాబ్దకాలం పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో నటించింది.
View this post on Instagram
దాదాపు తెలుగు హీరోలందరితో నటించింది. తొలినాళ్లలో రమ్య ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో నటించింది. తర్వాత అమ్మ పాత్రలు, దేవి పాత్రల్లో నటించడం ప్రారంభించింది. తమిళంలో రజనీకాంత్ సరసన నటించిన ‘నరసింహ’ రమ్య కెరీర్‌లో బలమైన పాత్రల్లో ఒకటి. ఇందులో విలన్ పాత్రలో అదరగొట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువగా అమ్మ పాత్రలలో నటించింది. కానీ రాజమౌళీ తెరకెక్కించిన బాహుబలి మూవీలో శివగామి దేవి పాత్రలో నటించింది. ఇది ఇప్పటివరకు ఆమె నటించిన అత్యుత్తమ పాత్రలలో ఒకటి. రమ్యకృష్ణ ఇప్పటికే మలయాళం, తమిళం, కన్నడ, హిందీ వంటి భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




