Ramesh Babu: మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు గురించి ఈ విషయాలు తెలుసా..
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేష్ బాబు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రమేష్ బాబు మరణం టాలీవుడ్ ఇండస్ట్రీని దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
రమేష్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ, ఇందిర దంపతులకు మొదటి సంతానం. 1965 అక్టోబర్ 13న చెన్నైలో జన్మించిన రమేష్ బాబు.. కృష్ణ వారసుడిగా బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. అల్లూరి సీతారామరాజు సినిమాతో తొలిసారిగా బాలనటుడిగా నటించారు. ఆ తర్వాత కృష్ణ నటించిన పలు చిత్రాల్లో బాలనటుడిగా నటించారు. దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్, నీడ, పాలు, నీళ్లు చిత్రాల్లో యువ నటుడిగా మెప్పించారు. 1987లో సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. చిన్ని కృష్ణుడు, బజార్ రౌడీ, కలియుగ కృష్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్ టైగర్, కృష్ణగారి అబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు, శాంతి ఎనతు శాంతి, నా ఇల్లే నా స్వర్గం, మామ కోడలు, అన్నా చెల్లెలు, పచ్చ తోరణం ఎన్ కౌంటర్ వంటి చిత్రాలతో మెప్పించారు. 1997లో వచ్చిన ఎన్ కౌంటర్ సినిమా చేసిన తర్వాత చిత్రాలకు దూరంగా ఉన్నారు రమేష్ బాబు.
సినిమాలకు దూరంగా ఉంటూనే నిర్మాతగా మారాడు రమేష్ బాబు. కృష్ణ ప్రొడక్షన్స్ హౌస్ స్థాపించి అర్జున్, అతిథి చిత్రాలను తెరకెక్కించారు. అలాగే.. దూకుడు, ఆగడు సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించారు. హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా సూర్యవంశ్ సినిమా తెరకెక్కించారు.
Also Read: Bangarraju: ‘బంగారు’ లిరికల్ వీడియో రిలీజ్.. ఇరగదీసిన నాగ చైతన్య, కృతి జోడీ..!
RameshBabu Passed Away: ఆయన మృతి మాకు తీరని లోటు.. కొవిడ్ నిబంధనలతో అంతక్రియలు: ఘట్టమనేని కుటుంబం
Ramesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం.. ఆయన సోదరుడు కన్నుమూత..!