Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreya Ghoshal: సింగర్ శ్రేయా ఘోషల్ ఆస్తులు ఇన్ని కోట్లా.. ? ఒక్కో పాటకు ఎంత వసూలు చేస్తుందంటే..

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఆమె ప్రత్యేకం. ఇప్పటివరకు ఎన్నో వందల పాటలు ఆలపించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అద్భుతమైన గాత్రంతో కోట్లాది శ్రోతల హృదయాలను గెలుచుకుంది. మార్చి 12న శ్రేయా ఘోషల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందామా.

Shreya Ghoshal: సింగర్ శ్రేయా ఘోషల్ ఆస్తులు ఇన్ని కోట్లా.. ? ఒక్కో పాటకు ఎంత వసూలు చేస్తుందంటే..
Shreya Ghoshal
Follow us
Rajitha Chanti

| Edited By: TV9 Telugu

Updated on: Mar 13, 2025 | 5:30 PM

సినీ సంగీత ప్రపంచంలో ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని సింగర్ శ్రేయా ఘోషల్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, హిందీ భాషలలో ఎన్నో వందల పాటలు పాడింది. అద్భుతమైన గాత్రంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. శ్రేయా ఘోషల్ మార్చి 12, 1984న పశ్చిమ బెంగాల్‌లోని బ్రహ్మపూర్‌లో జన్మించారు. బెంగాలీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె రాజస్థాన్‌లోని కోట సమీపంలోని రావత్‌పట్టాలో పెరిగారు. శ్రేయ తండ్రి విశ్వజిత్ ఘోషల్ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. శ్రేయ 4 సంవత్సరాల వయసులో పాడటం ప్రారంభించింది. శ్రేయ 6 సంవత్సరాల వయసులో సంగీతంలో అధికారిక శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది.

2000 సంవత్సరంలో 16 సంవత్సరాల వయసులో ‘సరిగమప’ అనే షోలో విజేతగా నిలిచింది. 2002లో సంజయ్ లీలా భన్సాలీ చిత్రం ‘దేవదాస్’ ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అదే సంవత్సరం తరువాత, కార్తీక్ రాజా స్వరపరిచిన తమిళ చిత్రం ఆల్బమ్ కోసం ‘సెల్లమే సెల్లం’ పాటను పాడింది. తమిళంలో ఆమె మొదటి పాట హిట్ అయిన తర్వాత, ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, ఎ.ఆర్. రెహమాన్, అనిరుధ్ వంటి ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పాడింది. ఇప్పటికే ఆమె 5 జాతీయ అవార్డులను అందుకుంది. శ్రేయా ఘోషల్ తన తొలి హిందీ చిత్రం దేవదాస్ చిత్రానికిగాను తన తొలి జాతీయ అవార్డును గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి

శ్రేయా ఘోషల్ దాదాపు రూ.185 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. ఆమె ఒక్కో పాటకు 25 లక్షలు వసూలు చేస్తారని సమాచారం. దీనితో పాటు, శ్రేయ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా పనిచేయడం ద్వారా కూడా సంపాదిస్తుంది. ఆమె తన చిన్ననాటి స్నేహితుడు శిలాదిత్య ముఖోపాధ్యాయను 2015 లో వివాహం చేసుకుంది. శిలాదిత్య స్మార్ట్‌ఫోన్ యాప్ ట్రూకాలర్‌కు గ్లోబల్ హెడ్. 2021లో, శ్రేయా ఘోషల్, శిలాదిత్య దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..