AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suhasini : సుహాసిని చెల్లెలు సైతం క్రేజీ హీరోయిన్.. పవన్ కళ్యాణ్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఆఫర్స్ లేక సింగర్‏గా..

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోయిన్లలో సుహాసిని ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన సుహాసిని ఇప్పుడు సహాయ నటిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం భాషలలో ఇప్పటికీ చేతినిండా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది.

Suhasini : సుహాసిని చెల్లెలు సైతం క్రేజీ హీరోయిన్.. పవన్ కళ్యాణ్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఆఫర్స్ లేక సింగర్‏గా..
Suhasini
Rajitha Chanti
|

Updated on: Dec 14, 2025 | 9:48 AM

Share

సీనియర్ హీరోయిన్ సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో అలరించిన అందాల నటి. 80’sలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో సుహాసిని ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. స్టార్ హీరోలకు మంచి జోడిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నకిపించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే డైరెక్టర్ మణిరత్నంను పెళ్లి చేసుకున్నారు సుహాసిని. తెలుగులో 50కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. కథానాయికగానే కాకుండా దర్శకులిగా, నిర్మాతగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి : 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..

ఒకప్పుడు హీరోయిన్ గా చక్రం తిప్పిన ఆమె.. ఇప్పుడు సహాయ నటిగా రాణిస్తున్నారు. యంగ్ హీరోహీరోయిన్లకు తల్లిగా, వదినగా, అత్తగా కనిపిస్తూ అలరిస్తున్నారు. అయితే మీకు తెలుసా.. ? సుహాసిని చెల్లెలు సైతం దక్షిణాదిలో తోపు హీరోయిన్. ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పవర్ ఫుల్ క్రేజీ బ్యూటీ. ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకుని తనదైన ఇమేజ్ క్రియేట్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో అనేక మూవీస్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. తనే హీరోయిన్ శ్రుతిహాసన్.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : సుమన్ శెట్టి ప్రభంజనం.. బిగ్‏బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్.. 14 వారాలకు ఎంత సంపాదించాడంటే..

కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా నిలిచింది. సుహాసిని తండ్రి కమల్ హాసన్ సొంత అన్నాతమ్ముళ్లు. అందుకే శ్రుతిహాసన్, సుహాసిని ఇద్దరూ అక్కచెల్లెళ్లు. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించిన శ్రుతి హాసన్.. ఇప్పుడు సినిమాలు తగ్గించింది. సలార్, కూలీ చిత్రాల తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అలాగే ఇటీవలే వారణాసి సినిమాలో శ్రుతి హాసన్ పాట పాడిన సంగతి తెలిసిందే. నటిగానే కాకుండా శ్రుతి మంచి సింగర్ కూడా.

ఇవి కూడా చదవండి :  Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..

ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

Follow Us