Tollywood : ఛాన్స్ ఇస్తానని చెప్పి ఆ హీరో హోటల్‌కు రమ్మన్నాడు.. ఇక్కడ పతివ్రతలు ఎవరు లేరు.. సీనియర్ హీరోయిన్..
సినిమా పరిశ్రమ అనేది గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. వెండితెరపై తమ నటనతో అలరించే చాలా మంది నటీనటుల జీవితాలు ఊహించినంత అందంగా ఉండవు. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ తమ కుటుంబాల కోసం కష్టపడేవారు చాలా మంది. మరికొందరు అనుహ్యంగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఇండస్ట్రీకి దూరమవుతుంటారు.

సినీరంగుల ప్రపంచంలో ఎంతో మంది నటీనటులు తమ నటనతో అలరించారు. వెండితెరపై సహజ సౌందర్యంతో మెప్పించిన ఎంతో మంది హీరోయిన్స్ .. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన తారలు.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమవుతుంటారు. అయితే ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే కేవలం అందం, ప్రతిభ మాత్రమే ఉంటే చాలదు. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో భువనేశ్వరి ఒకరు. ఒకప్పుడు తన అందంతో ఇండస్ట్రీని ఊపేసింది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : సుమన్ శెట్టి ప్రభంజనం.. బిగ్‌బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్.. 14 వారాలకు ఎంత సంపాదించాడంటే..
తెలుగులో దొంగరాముడు అండ్ పార్టీ, బాయ్స్, గుడుంబా శంకర్, చక్రం, సీమ శాస్త్రి, నువ్వంటే నాకిష్టం వంటి చిత్రాల్లో నటించింది. అప్పట్లో గ్లామర్ బ్యూటీగా ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యింది. అంతకు ముందు పలు సీరియల్స్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. నటనపై ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆమెకు తొలి నాళ్లల్లో తన రంగు చూసి ఎగతాళి చేసేవారట. అలాగే అవకాశాలు ఇస్తామని చెప్పి ఎంతోమంది తనను మోసం చేశారని గతంలో ఓ తమిళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే ఓ టాప్ హీరో సైతం తనతో చనువుగా ప్రవర్తించాడని తెలిపింది.
ఇవి కూడా చదవండి : 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..
ఒకసారి ఆ హీరో తనకు అవకాశాం ఇస్తానని.. ఏకాంతంగా కలవాలని చెప్పి ఈమెను ఓ హోటల్ కి రమ్మన్నాడని.. విషయం అర్థం కాక తాను వెళ్లానని.. అక్కడ మొదట తనను మాటలతో లొంగదీసుకున్నాడని.. ఆ తర్వాత అవకాశాలు ఇవ్వకుండా మరో నిర్మాతకు పరిచయం చేసి చేతులు దూలుపుకున్నాడని తెలిపింది. ఆ నిర్మాత సైతం తనపై ఇష్టంతో పలు సీరియల్స్ ఛాన్స్ ఇచ్చి పక్కకు తప్పుకున్నాడంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడ పతివ్రతలు ఎవరు లేరని.. స్టార్స్ అయ్యాక మాత్రం అందరూ అలా ప్రవర్తిస్తుంటారని తెలిపింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే వ్యభిచారంలో కేసులో ఆమె అరెస్ట్ అయినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

Bhuvaneswari News
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..




