AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pradeep Ranganathan: సినిమాలు హిట్‌.. హీరో ప్రదీప్‌కు చేదు అనుభవం మిగిల్చిన హీరోయిన్లు

కోలీవుడ్‌లో డైరెక్టర్‌గా, హీరోగా వైరల్ వైబ్, క్యాచీ కంటెంట్ తో తనదైన ముద్ర వేసిన యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్. 'లవ్‌టుడే'తో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకున్న ప్రదీప్, ఆ తర్వాత 'డ్రాగన్', 'డ్యూడ్' వంటి వరుస హిట్లు కొట్టాడు. తాజాగా తన కొత్త ..

Pradeep Ranganathan: సినిమాలు హిట్‌.. హీరో ప్రదీప్‌కు చేదు అనుభవం మిగిల్చిన హీరోయిన్లు
Pradeep Ranganathan
Nikhil
|

Updated on: Dec 14, 2025 | 9:54 AM

Share

కోలీవుడ్‌లో డైరెక్టర్‌గా, హీరోగా వైరల్ వైబ్, క్యాచీ కంటెంట్ తో తనదైన ముద్ర వేసిన యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్. ‘లవ్‌టుడే’తో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకున్న ప్రదీప్, ఆ తర్వాత ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి వరుస హిట్లు కొట్టాడు. తాజాగా తన కొత్త సినిమా ‘ఎల్‌ఐకే’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ప్రమోషన్స్ సందర్భంగా, తాను పరిశ్రమలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను పంచుకున్నాడు. ముఖ్యంగా, తను హీరోగా ఎంట్రీ ఇస్తున్నప్పుడు హీరోయిన్ల నుంచి ఎదురైన తిరస్కరణ గురించి చెప్పిన మాటలు సినీ వర్గాలను ఆశ్చర్యపరిచాయి.

‘లవ్‌టుడే’ సినిమా సమయంలో హీరోయిన్ కోసం తాను ఎంతో మందిని సంప్రదించినట్లు ప్రదీప్ వెల్లడించాడు. తను హీరో అనగానే చాలా మంది హీరోయిన్లు ముఖం మీదే ‘నో’ చెప్పారని తెలిపాడు. కొందరేమో తమకు డేట్స్ లేవంటూ కారణాలు చెప్పగా, మరికొందరేమో కేవలం పెద్ద స్టార్లతో మాత్రమే నటిస్తామని చెప్పినట్లు ప్రదీప్ వివరించాడు. ఆ సమయంలో తన మీద తనకే చాలా అనుమానాలు కలిగాయని, ఆత్మవిశ్వాసం దెబ్బతిందని చెప్పాడు. అయితే సినిమా విడుదల అయ్యాక ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన చూసి, తనలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది అని ప్రదీప్ తెలిపాడు.

ఈ యంగ్ హీరో జర్నీ చూస్తే.. సినిమా అంటే అతనికి ఎంత పిచ్చి ఉందో అర్థమవుతుంది. కాలేజీలో కేవలం రూ.500 ఖర్చుతో తన మొదటి షార్ట్‌ఫిల్మ్‌ను తీశాడు. ఆ షార్ట్‌ఫిల్మ్ బాగా వైరల్ అవ్వడంతో యూట్యూబ్ నుంచి వచ్చిన రూ.40 వేల రెవెన్యూతో మంచి కెమెరా కొని రెండో షార్ట్‌ఫిల్మ్ చేశానని చెప్పాడు. కాలేజీ పూర్తి కాగానే ఐటీ ఉద్యోగంలో చేరినా, ఏడాదిన్నర తర్వాత రాజీనామా చేసి, కథలు పట్టుకుని ప్రొడక్షన్ హౌస్‌ల చుట్టూ తిరిగాడు. చాలా మంది నిర్మాతలు కథ పూర్తిగా వినకముందే రిజెక్ట్ చేసి పంపేవారని గుర్తు చేసుకున్నాడు.

తండ్రి స్ఫూర్తితోనే..

తన సక్సెస్ వెనుక తన తండ్రి గొప్ప స్ఫూర్తి ఉన్నారని ప్రదీప్ చెప్పాడు. తన తండ్రి జిరాక్స్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించారని, ఇప్పుడు తనకు సినిమాలతో పేరు, డబ్బు వచ్చినా ఆయన ఇప్పటికీ ఆ షాప్‌నే నడుపుతున్నారని తెలిపాడు. ‘మన మూలాలు మరిచిపోకూడదు’ అనేది ఆయన సిద్ధాంతమని, కారు కొనిస్తానని చెప్పినా బస్సులోనే షాప్‌కు వెళ్తారని చెప్పాడు.

అంతేకాక, తాను డైరెక్ట్ చేసిన ‘కోమలి’ హిట్ అయిన తర్వాత నిర్మాత తనకు కారు బహుమతిగా ఇచ్చినా, ఆ సమయంలో తన దగ్గర పెట్రోల్ కొట్టించే డబ్బు కూడా లేకపోవడంతో కారును మెయింటేన్ చేయడం భారం అనిపించిందన్నాడు. అందుకే కారు తిరిగి ఇచ్చి కొంత సొమ్ము తీసుకున్నానని, ఆ డబ్బుతోనే ఇండస్ట్రీలో మూడేళ్లు బతికానని చెప్పాడు. తన ‘లవ్‌టుడే’ సినిమా చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా తనకు ఫోన్ చేసి, తన నటనను, కథల్లోని నిజాయితీని మెచ్చుకున్నారని చెప్పడం తన కెరీర్‌లో మర్చిపోలేని విషయం అని ప్రదీప్ భావోద్వేగానికి లోనయ్యాడు.

Follow Us