Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2023: ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలై బోల్తా కొట్టిన సినిమాలు ఇవే

ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అలాగే ఎన్నో డిజాస్టర్స్ కూడా వచ్చాయి. భారీ అంచనాల మధ్య సినిమాలు విడుదలైన కొన్ని ప్రేక్షకులను అలరించలేకపోయాయి. స్టార్ హీరోల సినిమాలు కూడా.. అభిమానులను ప్రేక్షకులను నిరాశపరిచాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు కూడా డిజాస్టర్స్ గా నిలిచాయి.

Year Ender 2023: ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలై బోల్తా కొట్టిన సినిమాలు ఇవే
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 14, 2023 | 11:29 AM

మరికొద్ది రోజుల్లో 2023కి గుడ్ బై చెప్పనున్నాం.. కొత్త ఏడాదికి స్వాగతం చెప్పనున్నాం. ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అలాగే ఎన్నో డిజాస్టర్స్ కూడా వచ్చాయి. భారీ అంచనాల మధ్య సినిమాలు విడుదలైన కొన్ని ప్రేక్షకులను అలరించలేకపోయాయి. స్టార్ హీరోల సినిమాలు కూడా.. అభిమానులను ప్రేక్షకులను నిరాశపరిచాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు కూడా డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇక ఈ ఏడాది ప్రేక్షకులను నిరాశ పరిచిన సినిమాలు ఏవో ఒక్కసారి చూద్దాం..

ఆదిపురుష

ఈ ఏడాది విడుదలైన మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘ఆదిపురుష’ కూడా ఒకటి. అయితే సినిమా విడుదలయ్యాక సినిమా చూసిన జనాలు గగ్గోలు పెట్టారు. రామాయణ కథను వక్రీకరించారని పలువురు ఆరోపించారు. ఈ సినిమాతో ప్రభాస్ పెద్ద ఫ్లాప్ అందుకున్నాడు. ఈ చిత్రానికి ఓం రావత్ దర్శకత్వం వహించారు.

చంద్రముఖి 2

‘చంద్రముఖి’ సూపర్ హిట్ అయింది.  రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా భారీ విజయం సాధించగా.. దీని సీక్వెల్ ఈ ఏడాది విడుదలైంది. ఆ సినిమా పరాజయం పాలైంది. ఈ సినిమాపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.

శాకుంతలం

సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా ఈ ఏడాది విడుదలైంది. ఈ సినిమా సమంత కెరీర్‌కి మైలేజ్ ఇస్తుందని అంతా అంటున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా .. ఘోర పరాజయాన్ని చవిచూసింది.

ఏజెంట్

అఖిల్ అక్కినేని నటించిన ‘ఏజెంట్’ చిత్రం టీజర్ , ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు దారుణంగా నిరాశపడ్డారు. చిత్ర బృందం ప్రేక్షకులకు క్షమాపణలు కూడా చెప్పింది. అంతలా డిజాస్టర్ అయ్యింది ఏజెంట్.

కస్టడీ

నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’ సినిమా కూడాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఆయన విజయం సాధిస్తారని అభిమానులు ఆశించారు.కానీ అలా జరగలేదు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

భోలా శంకర్

చిరంజీవి ఈ ఏడాది ‘భోళా శంకర్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా ఆయన అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు.

సెల్ఫీ

ఈ ఏడాది బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ సినిమాలు ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోతున్నాయి. ఆయన నటించిన చిత్రం ‘సెల్ఫీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది ఈ సినిమా.

మిషన్ రాణిగంజ్

ఈ ఏడాది అక్షయ్ కుమార్ నటించిన మరో సినిమా పరాజయం పాలైంది. అదే ‘మిషన్ రాణిగంజ్’. యదార్థ సంఘటన ఆధారంగా ‘మిషన్ రాణిగంజ్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా ఓ మోస్తరు వసూళ్లు సాధించింది.

‘షెహజాద్’

సౌత్ ఇండియన్ సినిమాలను బాలీవుడ్ కి రీమేక్ చేసే పని ఇటీవల జోరందుకుంది. టాలీవుడ్ లో అల్లు అర్జున్ నైంసిన ‘అల వైకుంఠపురమాలో’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు.. బాలీవుడ్ లో ఈ సినిమా రీమేక్ అదే రేంజ్ లో ఫ్లాప్ అయ్యింది.ఈ  చిత్రాన్ని హిందీలో ‘షెహజాదా’గా రీమేక్ చేశారు. ఘోరంగా డిజాస్టర్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..