Heroines : నార్త్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటాలని చూస్తున్న ముద్దుగుమ్మలు
జవాన్ సినిమా విడుదలైనప్పుడు నయన్‌కి నార్త్ లో పెద్దగా వెల్కమ్ దక్కలేదనే మాట బాగా వినిపించింది. రావాల్సినంత గుర్తింపు రాలేదన్నవారే ఎక్కువ. అయితే రోజులు గడిచేకొద్దీ అందరూ లేడీ సూపర్‌స్టార్ పెర్ఫార్మెన్స్ ని పొగడసాగారు. శభాష్ నయన్ అని మెచ్చుకున్నారు. ఇటు యానిమల్ రిలీజ్ అయినప్పుడు రష్మిక పరిస్థితి కూడా అదే. రష్మికకు ఎక్కువ గుర్తింపు వచ్చిందా?

ప్యాన్ ఇండియా కల్చర్ స్ప్రెడ్ అవుతున్న సమయంలో ఇంకా నార్త్, సౌత్ అనే తేడాలుంటాయా.? అని అడిగితే.. ఎందుకు ఉండవు అనే ఆన్సర్ చటుక్కున వినిపిస్తుంది. మనవాళ్లు అక్కడ విజయం సాధించిన ప్రతిసారీ, నార్త్ వాళ్లు ఇక్కడ ప్రచారం ప్రారంభించిన ప్రతిసారీ తప్పక తలచుకుంటూనే ఉన్నాం అన్నది కోరస్‌గా వినిపిస్తున్న మాట. ఇది హీరోయిన్లకు కూడా వర్తిస్తుందా..?
జవాన్ సినిమా విడుదలైనప్పుడు నయన్‌కి నార్త్ లో పెద్దగా వెల్కమ్ దక్కలేదనే మాట బాగా వినిపించింది. రావాల్సినంత గుర్తింపు రాలేదన్నవారే ఎక్కువ. అయితే రోజులు గడిచేకొద్దీ అందరూ లేడీ సూపర్‌స్టార్ పెర్ఫార్మెన్స్‌ని పొగడసాగారు. శభాష్ నయన్ అని మెచ్చుకున్నారు. ఇటు యానిమల్ రిలీజ్ అయినప్పుడు రష్మిక పరిస్థితి కూడా అదే. రష్మికకు ఎక్కువ గుర్తింపు వచ్చిందా.? గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన తృప్తి డిమ్రికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందా అనే డిస్కషన్ నడిచింది. అయితే గీతాంజలి కేరక్టర్‌లో రష్మిక కేక పెర్ఫార్మెన్స్ ఇచ్చారన్నది క్రిటిక్స్ యునానిమస్‌గా చెప్పిన మాట.
మరి 2023లో నయన్ అండ్ రష్మిక కలిసికట్టుగా సాధించిన విషయాన్ని 2024లో కీర్తీ సురేష్ కంటిన్యూ చేస్తారా.? ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్. ఆల్రెడీ అట్లీ ప్రొడక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నారు కీర్తీ సురేష్. ఇటు డిజిటల్‌లోనూ అక్క అనే సీరీస్ చేస్తున్నారు నార్త్ లో. ఈ రెండు ప్రాజెక్టులతో బాలీవుడ్ డెబ్యూని టెస్ట్ చేసుకోబోతున్నారు ఈ బ్యూటీ. అలాగే ఎప్పటి నుంచో నార్త్ మీద పట్టుసాధించాలన్నది పూజా హెగ్డే ముందున్న టార్గెట్. చేసిన అటెంప్టులు ప్రీ రిలీజ్ టైమ్‌లో సౌండ్ చేస్తున్నాయి కానీ, సక్సెస్ మాత్రం చూడలేకపోతున్నాయి. ప్రస్తుతం షాహిద్‌కపూర్‌తో దేవాలో నటిస్తున్నారు పూజా. వచ్చే ఏడాది దసరాకు రిలీజ్‌కి రెడీ అవుతోంది ఈ ప్రాజెక్ట్. వీరితో పాటు సౌత్ ఇండస్ట్రీ సినిమాలతో బిజీగా ఉన్న సాయిపల్లవి, నార్త్ రామాయణంలో సీతమ్మతల్లిగా నటిస్తారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. సో, 2023లో నయన్ అండ్ రష్మిక రిలేని సౌత్‌లో కంటిన్యూ చేయాల్సిన కంపల్సరీ సిట్చువేషన్‌లో ఈ బ్యూటీలందరూ ఉన్నారన్నమాట.
View this post on Instagram
సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
