Prabhas: ఒక్కడు నుంచి ఊసరవెల్లి వరకు ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే.. అన్ని సూపర్ హిట్సే..

సాధారణంగా సినీ పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన మూవీ మరో హీరో చేస్తేంటుంది.. ఒకరికి ప్లస్ అయ్యేది... మరోకరి మైనస్ అవుతుంది.

Prabhas: ఒక్కడు నుంచి ఊసరవెల్లి వరకు ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే.. అన్ని సూపర్ హిట్సే..
Prabhas
Follow us

|

Updated on: Mar 15, 2022 | 11:30 AM

సాధారణంగా సినీ పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన మూవీ మరో హీరో చేస్తేంటుంది.. ఒకరికి ప్లస్ అయ్యేది… మరోకరి మైనస్ అవుతుంది. ఒకరు చేజార్చుకున్న అవకాశం.. మరోకరి చెంతకు చేరిపోతుంది. అలా ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురు స్టార్ హీరోస్ కాదనుకున్న సినిమాలు మరో హీరోకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాయి. అలా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వద్దనుకున్న సినిమాలు ఇతర హీరోలు నటించి సూపర్ హిట్ అయ్యాయి. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టా్ర్‏గా మారిపోయాడు ప్రభాస్. ఈ మూవీతో ప్రభాస్ (Prabhas) క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. సౌత్ టూ నార్త్ ప్రభాస్‏కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజిగా ఉన్నాడు డార్లింగ్. ఇక ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ (Radhe Shyam) సినిమా సూపర్ హిట్ అయ్యింది. మార్చి 11న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుంది.

అయితే ప్రభాస్ గతంలో చాలా వరకు చిత్రాలను కాదనుకున్నాడు. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. మరి అవెంటో తెలుసుకుందామా.

ఒక్కడు..

మహేష్ బాబు.. భూమిక చావ్లా జంటగా నటించిన ఒక్కడు సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా స్టోరీని చిత్రనిర్మాత గుణశేఖర్ ముందుగా ప్రభాస్ కు వినిపించాడట. కాన్సెప్ట్ కాస్త్ రిస్క్ అనిపించడంతో ప్రభాస్ ఈ మూవీని వదిలేశాడట..

దిల్

నితిన్ ప్రధాన పాత్రలో నటించిన దిల్ మూవీ సూపర్ హిట్. నితిన్ కెరీర్‏లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఇది ప్రభాస్ చేయాల్సిన మూవీ.. తను వేరే సినిమాతో బిజీగా ఉండడంతో దిల్ మూవీ చేయలేదట.

సింహాద్రి.. జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి బ్లాక్ బస్టర్ హిట్. అయితే పూర్తి మాస్ సినిమాలో తాను సరిపోలేనని కాదనుకున్నాడట.

ఆర్య.. తొలిసారి అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య సినిమా థియేటర్లలో సందడి చేసింది. అయితే ఈ మూవీ కాన్సెప్ట్ నచ్చక ప్రభాస్ తిరస్కరించాడట.

బృందావనం.. జూనియర్ ఎన్టీఆర్.. సమంత.. కాజల్ కలిసి నటించిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ కోసం ప్రభాస్ ను సంప్రదించగా.. ఆ సమయంలో డార్లింగ్, మిస్టర్ ఫర్ఫెక్ట్ చిత్రాలతో బిజీగా ఉన్నందున చేయలేకపోయాడట.

నాయక్.. ఈ మూవీని దర్శకుడు వివి వినాయక్‌ నాయక్‌ కథను ప్రభాస్‌కి వినిపించారు, అయితే మిర్చితో కమిట్‌మెంట్‌ ఉన్నందున చేయలేకపోయాడట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు వినిపించగా.. చివరకు రామ్ చరణ్ ఓకే చెప్పాడు.

కిక్.. మాస్ మాహారాజా రవితేజ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ స్టోరీ ప్రబాస్ కు నచ్చకపోవడంతో ఒప్పుకోలేదు.

డాన్ శీను.. గోపిచంద్ మలినేని తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. కానీ ఈ మూవీ కోసం ముందు ప్రబాస్ ను సంప్రదించగా.. కాన్సెప్ట్ నచ్చక రిజెక్ట్ చేశాడు.

జిల్.. ఈ మూవీ ముందుగా ప్రభాస్ వరకు వచ్చింది. కానీ ఆ సమయంలో అతను బాహుబలి సినిమాతో ఉండడం వలన తన స్నేహితుడు గోపీచంద్ పేరును సూచించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఊసరవెల్లి.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్. కానీ ముందుగా ఈ మూవీ కోసం ప్రభాస్ ను సంప్రదించారట. కానీ కాన్సెప్ట్ నచ్చక వదిలేశాడట.

Also Read: Ajith: అజిత్‌ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు

Radhe Shyam: వెజిటేరియన్ హోటల్‏కు వెళ్లి చికెన్ బిర్యానీ కావాలంటే ఎలా ?.. రాధేశ్యామ్ డైరెక్టర్ అసంతృప్తి..

Singer Chinmayi: ప్రధాని కావాలని కోరిన అభిమాని.. అదే వరస్ట్ ప్రపంచంలోనే టఫ్ అంటూ రిప్లై ఇచ్చిన సింగర్..

ఈ బ్లడ్ గ్రూపు ఉన్నవారు చాలా మందికి రోల్ మోడల్స్.. ప్రేమ.. పెళ్లి వీరి జీవితంలో ఎలా ఉంటాయంటే..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.