AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashant Neel: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బావ కన్నడలో స్టార్ హీరో.. తెలుగులోకి ఎంట్రీ..

కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా లెవల్లో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కన్నడ హీరో యష్ ప్రధాన పాత్రలో నీల్ తెరకెక్కించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కేజీఎప్ 2తో మరో హిట్ అందుకున్నారు. ఇక ఇటీవలే సలార్ మూవీతో మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు. ఇందులో ప్రభాస్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

Prashant Neel: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బావ కన్నడలో స్టార్ హీరో.. తెలుగులోకి ఎంట్రీ..
Srimurali, Prashant Neel
Rajitha Chanti
|

Updated on: Oct 24, 2024 | 10:19 AM

Share

డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ఉగ్రం సినిమాతో కన్నడ సినీరంగంలోకి దర్శకుడిగా పరిచయమైన నీల్.. కేజీఎఫ్ చాప్టర్ 1, 2 చిత్రాలతో దేశవ్యాప్తంగా టాప్ దర్శకులలో ఒకరిగా మారారు. కేజీఎఫ్ చిత్రాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి సలార్ మూవీ మరోసారి భారీ హిట్ కొట్టాడు. అతి తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్ అయ్యాడు. అలాగే ప్రశాంత్ నీల్ సినిమాల కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం సలార్ 2 ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. అలాగే త్వరలోనే కేజీఎఫ్ 3 సినిమాతోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోనూ ఓ సినిమా స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఫ్యామిలీలో ఓ స్టార్ హీరో ఉన్నాడు. అవును.. ప్రశాంత్ నీల్ బావ కన్నడలో స్టార్ హీరో.

ఇప్పుడు అతను తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కన్నడలో శ్రీమురళి తన మొదటి సినిమా చంద్ర చకోరితోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా హిట్స్ అందుకుంటూ రోరింగ్ స్టార్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. కన్నడ చిత్రపరిశ్రమలో అతడికి మంచి పాలోయింగ్ ఉంది. 2008లో శ్రీ మురళికి ప్రశాంత్ నీల్ అక్క విద్యతో వివాహం జరిగింది. ప్రశాంత్ నీల్ కు మొదటి ఛాన్స్ ఇచ్చింది కూడా శ్రీ మురళినే.

ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఫస్ట్ మూవీ ఉగ్రంలో శ్రీమురళినే హీరో. ప్రస్తుతం అతడు బఘీర సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. అంటే తెలుగులోనూ ఈ మూవీ విడుదల కానుంది. దీంతో శ్రీ మురళి ఇప్పుడు తెలుగులోనూ ప్రమోషన్స్ చేస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ కథ అందించారు.

View this post on Instagram

A post shared by SriiMurali (@sriimurali)

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us