AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Prices: వెండిపై ధరలపై షాకింగ్ న్యూస్.. వారం రోజుల్లో ఎంత పెరిగాయో తెలుసా..?

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గత వారం రోజుల్లో భారీగా పెరుగుదల నమోదు చేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందంపై గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో పాటు డాలర్ బలహీనపడిపోయింది. దీంతో బంగారం, వెండి వైపు పెట్టుబడులు వస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయి.

Venkatrao Lella
|

Updated on: Apr 12, 2026 | 11:20 AM

Share
బంగారం, వెండి ధరలు గత కొద్దిరోజులుగా పుంజుకుంటున్నాయి. గత వారం రోజులుగా ధరలు భగ్గుమంటున్నాయి. గోల్డ్ రేట్లు అధికంగా ట్రేడ్ అవుతోండగా.. వెండి ధరలు కూడా భారీగా పెరుగుదల నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, అమెరికా డాలర్ బలహీనపడటం కూడా ధరల పెరుగుదలకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. గత వారం రోజుల్లో సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

1 / 5
వారం రోజుల్లో వెండి ధరలు బలంగా పుంజుకున్నాయి.  ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందంపై అనిశ్చితి నెలకొనడం ధరలు పెరుగుదలకు దోహదపడింది. ఇక అమెరికా డాలర్ బలహీనపడటంతో పెట్టుబడిదారుల దృష్టిని వెండి ఆకర్షించింది. ఈ రెండు అంశాలు వెండి పెరుగుదలకు అనుకూలంగా మారాయి.

2 / 5
వారం రోజుల్లో కేజీ వెండిపై రూ.10 వేలు పెరిగింది. వెండి దాదాపు 4 శాతంకిపైగా పెరిగింది. ఏప్రిల్ 5వ తేదీన కిలో వెండి హైదరాబాద్‌లో రూ.2.55 లక్షలుగా ఉండగా.. ఏప్రిల్ 6వ తేదీన రూ.5 వేలు పెరిగి రూ.2.60 లక్షలకు చేరుకుంది. ఇక 7వ తేదీన రూ.2.55 లక్షలు, 8వ తేదీన రూ.2.65 లక్షలు, ఏప్రిల్ 9న రూ.2.60 లక్షలు, ఏప్రిల్ 10న రూ.2.65 లక్షలుగా ఉంది.

3 / 5
ఏప్రిల్ 11న రూ.2.65 లక్షలు, ఏప్రిల్ 12న రూ.2.65 లక్షలుగా ఉంది. అంటే వారం రోజుల్లో రూ.10 వేలు పెరిగింది. ఇక సిల్వర్ ధరలు ఒకరోజు తగ్గుతుండగా.. తర్వాత రోజు పెరుగుతున్నాయి. ఇక బంగారం ధరలు కూడా వారం రోజుల్లో పెరిగాయి.  గోల్డ్ రేటు రూ.3800 మేర పెరిగింది. ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై రోజుకో ట్విస్ట్ వస్తుండటంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులపై వైపు చూస్తున్నారు.

4 / 5
ఈ క్రమంలో బంగారం, వెండి డిమాండ్‌పై పెరుగుదల ఒత్తిడిని కల్గిస్తోంది. ఇక డాలర్ బలపడితే పెట్టుబడిదారులు దాని నుంచి తమ పెట్టుబడులను మళ్లించేవారు. అయితే డారల్ బలహీనపడితే బంగారం, వెండిపై పెట్టుబడులు పెడతారు. దీంతో వల్ల వీటి ధరలు పెరుగుతాయి.

5 / 5
Follow Us