Tollywood : ఇండస్ట్రీలో గట్స్ ఉన్న ఏకైక హీరోయిన్ ఆమెనే.. ఏ విషయమైన ముఖం మీదే చెప్పేస్తుంది..
దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు తన కెరీర్, చలనచిత్ర పరిశ్రమ పరిణామంపై తన ఆలోచనలను పంచుకున్నారు. ఆయన మాయాబజార్, కృష్ణార్జున యుద్ధం వంటి పౌరాణిక చిత్రాలకు పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఈ రెండు కథలు మహాభారతంలో లేవని, వాటికి జైమిని భారతం, బెంగాలీ వర్షన్ వంటి మూలాలు ఉన్నాయని వివరించారు. నేటి సినిమా నిర్మాణంలో భావ దారిద్ర్యం ఉందని, డబ్బు కొరత లేదని, కానీ సృజనాత్మకత తగ్గిందని అభిప్రాయపడ్డారు.

దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో దశాబ్దాలుగా అనేక హిట్ చిత్రాలను తెరకెక్కించి తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో పొందిన అనుభవాలను, చలనచిత్ర పరిశ్రమలో వచ్చిన మార్పులపై తన వెల్లడించారు. ముఖ్యంగా పౌరాణిక చిత్రాల నిర్మాణం, సృజనాత్మక సవాళ్లు, నటీనటుల క్రమశిక్షణ వంటి అంశాలపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన కెరీర్‌లో మాయాబజార్, కృష్ణార్జున యుద్ధం అనే రెండు పౌరాణిక చిత్రాలకు సాంకేతికంగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ఈ రెండు కథలు మహాభారతంలో నేరుగా లేనివని, మాయాబజార్ కథను 16వ శతాబ్దంలో ఎవరో ఒకరు అభిమన్యుడు ఉత్తరను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే ప్రశ్న నుండి మార్చారని, శశిరేఖ పాత్ర తమిళంలో వత్సలగా ఉందని, ఉత్తరాదిన ఈ కథ లేదని తెలిపారు. కృష్ణార్జున యుద్ధం కథ గయోపాఖ్యానం ఆధారంగా రూపొందిందని, ఇది జైమిని భారతం, బెంగాలీ వర్షన్లలో ఉందని వివరించారు. నారదుడు, ద్రౌపది, అర్జునుడు, కృష్ణుడు, సత్యభామ, రుక్మిణి వంటి పాత్రలు ఈ కథలో ఎలా కీలకమయ్యాయో ఆసక్తికరంగా వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఈ దుర్మార్గుడే సర్.. ఆ నటుడిపై చిరంజీవికి కంప్లైంట్ చేసిన సౌందర్య.. అసలేం జరిగిందంటే..
గతంలో శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి పెద్ద చిత్రానికి ఆయనతో పాటు మరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే ఉండేవారని, ప్రస్తుతం పది మందికి పైగా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండటం వల్ల ఏ ఒక్కరికీ సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండటం లేదని పేర్కొన్నారు. డిజిటల్ టెక్నాలజీ రాకతో సినిమా మేకింగ్ ప్రక్రియ జెనరిక్ స్వభావాన్ని కోల్పోయిందని సింగీతం తెలిపారు. గతంలో ఒక తరం మారింది సినిమా షూటింగ్ అనుభవాన్ని ఉదాహరణగా చెబుతూ, కెమెరామెన్ బాలు మహేంద్ర ఆ సినిమాలోని ఒక భావోద్వేగ సన్నివేశానికి తాను చెప్పని విధంగా జూమ్ చేసి, ఆ భావాన్ని మరింత బలంగా చూపారని గుర్తు చేసుకున్నారు. ప్రతి భావోద్వేగానికి ఒక సరైన కోణం ఉంటుందని, షాట్లు ఒక భాషలో భాగమని, డిజిటల్ యుగంలో అనేక యాంగిల్స్ నుండి తీయడం వల్ల ఎడిటర్ దర్శకుడిగా మారుతున్నాడని, అసలు దర్శకుడు వెనుక సీటుకు నెట్టివేయబడుతున్నాడని విమర్శించారు.
ఎక్కువ మంది చదివినవి : Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..
నటీనటుల పారితోషికాల గురించి మాట్లాడుతూ, రామారావు కాలం నుండి ఇప్పటి వరకు ఇది ఎప్పుడూ ఒక సమస్యేనని, అయితే వారు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగితే, ఎంత పారితోషికమైనా తనకు అభ్యంతరం లేదని సింగీతం స్పష్టం చేశారు. అయితే, పారితోషికానికి, క్రమశిక్షణ లేకపోవడం లేదా “టాంట్రమ్స్”కి చాలా తేడా ఉందని వివరించారు. ఈ సందర్భంలో నటి పీ. భానుమతి తెగువను ఉదాహరణగా చెప్పారు. ఆమె తన సొంత చిత్రాలకు సమయానికి వస్తానని, బయటి చిత్రాలకు ఆలస్యంగా వస్తానని చెప్పినప్పటికీ, ఆమె “నా పిక్చర్ అయినా, ఎవరి పిక్చర్ అయినా నేను ఇచ్చేది ఇస్తాను” అనే దృఢమైన వైఖరిని కలిగి ఉండేదని తెలిపారు. ఇది ఆమె వ్యక్తిత్వంలోని గొప్పదనమని పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

Bhanumathi
ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..
