AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumaith Khan: అందుకే సినిమాలకు బ్రేక్.. చావు అంచులవరకు వెళ్లొచ్చా.. ముమైత్ ఖాన్ లైఫ్‌లో ఇంత విషాదం జరిగిందా.!!

ఇప్పుడంటే సినిమాలు తగ్గించేసింది కానీ ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్. తన హుషారెత్తించే స్టెప్పులతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైందీ అందాల తార. పోకిరిలో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ముమైత్ ఖాన్.

Mumaith Khan: అందుకే సినిమాలకు బ్రేక్.. చావు అంచులవరకు వెళ్లొచ్చా.. ముమైత్ ఖాన్ లైఫ్‌లో ఇంత విషాదం జరిగిందా.!!
Mumait Khan
Rajeev Rayala
|

Updated on: Jul 14, 2026 | 10:25 AM

Share

ముమైత్ ఖాన్ గుర్తుందా.? ఒకప్పుడు ఓ ఊపుఊపేసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన జీవితంలోని అత్యంత భావోద్వేగ, సవాళ్లతో కూడిన దశను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ముమైత్. ఒకప్పుడు ఐటెం సాంగ్స్‌కు పర్యాయపదంగా నిలిచిన ముమైత్, ఈ సుదీర్ఘ విరామానికి దారితీసిన సంఘటనల గురించి వివరించారు. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ముమైత్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించగా యాంకర్, ఆమె తన ఇంట్లోనే ఉన్నానని బదులిచ్చారు. ఒకరోజు స్నానం చేసి బయటకి వచ్చి, వార్డ్‌రోబ్‌లోని అద్దం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వివరించారు. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుని, తిరిగి వెళ్తున్న సమయంలో కాలు జారి పడిపోయానని ఆమె తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె పడిపోయిన విధానం, దానికి దారితీసిన పరిస్థితుల గురించి కూడా తెలిపింది ముమైత్.

ఇది కూడా చదవండి : ఐరెన్ లెగ్ అని అవమానించారు.. 9 సినిమాలనుంచి తీసేశారు.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ హీరోయిన్

ముమైత్ తన బెడ్‌రూమ్‌లోని బెడ్ ఇటాలియన్ మోడల్ అని, అది చాలా తక్కువ ఎత్తులో, పదునైన అంచులతో ఉంటుందని చెప్పారు. మోడరన్, ఈస్తటిక్ థింగ్స్‌ను తాను ఇష్టపడతానని, అందుకే అలాంటి బెడ్‌ను ఎంచుకున్నానని తెలిపారు. అయితే, అదే బెడ్ అంచులకు తగిలి తీవ్రమైన గాయమైంది. ఆమె కాలు జారిపడగానే, ఆ పదునైన అంచులకు తగిలి మూడు నరాలు తెగిపోయాయని ముమైత్ వెల్లడించారు. ఈ గాయం బయట నుంచి కనిపించలేదు కానీ, లోపల తీవ్ర రక్తస్రావం జరిగిందని ఆమె అన్నారు. తనకి లోపలికి దెబ్బ తగిలిందని, అది ఎంత తీవ్రమైనదో తెలుసుకోవడానికి సమయం పట్టిందని ఆమె అన్నారు. ఈ ప్రమాదం కారణంగా ముమైత్ స్పృహ కోల్పోయి, నేరుగా ఆసుపత్రిలోనే కోమా నుంచి బయటపడిందట. దాదాపు 15 రోజుల పాటు ఆమె కోమాలో ఉన్నారని, ఆ తర్వాతే స్పృహలోకి వచ్చారని తెలిపింది ముమైత్. వైద్యులు మాట్లాడుతూ, మరో రోజు పాటు కోమాలో ఉండి ఉంటే యూరిన్ ఇన్‌ఫెక్షన్లు, ఇతర తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉండేదని చెప్పినట్లు ముమైత్ తెలిపింది. ప్లాస్టిక్ పైపులు, ఇతర వైద్య పరికరాలు అమర్చినందున ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం అధికంగా ఉండేదని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేశాడు.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు

ఈ భయంకరమైన అనుభవం ముమైత్ జీవితంలో ఒక కీలక మలుపు. తన ప్రాణాలను కాపాడుకున్న తర్వాత, ఆమె నెమ్మదిగా కోలుకొని తిరిగి సాధారణ జీవితంలోకి రావడానికి ప్రయతించిందట. ఈ ఇంటర్వ్యూ ద్వారా తన ఆరోగ్య పరిస్థితిని, ఇండస్ట్రీకి దూరంగా ఉండటానికి గల కారణాన్ని వివరించారు. ముమైత్ ఖాన్ ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. పలు టీవీ షోల్లో పాల్గొంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ముమైత్. అలాగే గతంలో బిగ్ బాస్ గేమ్ షోలో కూడా పాల్గొంది.

ఇది కూడా చదవండి : ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని

View this post on Instagram

A post shared by Mumtaz Khan (@mumait)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us