AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇదేం పద్దతిరా నాయన.. వర్షం కోసం గాడిదలకు పెళ్లి.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..?

నైరుతి రుతుపవనాలు వచ్చినా తెలుగు రాష్ట్రాల వాన చినుకు జాడ కనిపించడం లేదు. వర్షాకాలం మొదలై చాలా రోజులైనా వర్షాలు కనుకరించడం లేదు. దీంతో కరువు పరిస్థితులు దాపురించాయి. రైతులు వర్షాల్లేక అల్లాడిపోతున్నాయి. వాన చినుకు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో..

Andhra Pradesh: ఇదేం పద్దతిరా నాయన.. వర్షం కోసం గాడిదలకు పెళ్లి.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..?
Anathapur
Nalluri Naresh
| Edited By: |

Updated on: Jul 14, 2026 | 10:34 AM

Share

అనంతపురం జిల్లా వజ్రకరూరులో వర్షం కోసం గ్రామస్తులు వింత ఆచారం పాటిస్తున్నారు. గాడిదలకు పెళ్లి చేసి వర్షం కురిపించేలా చేయాలని గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. వరుణుడు ముఖం చాటేయడంతో చినుకు జాడలేక అన్నదాతలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. రైతులు, గ్రామస్తుల ఇబ్బందులు కొంతైనా తొలగాలని వరుడు కరుణించి వర్షం కురిసేలా చేయాలని గాడిదలకు పెళ్లి చేశారు గ్రామస్తులు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేంద్రంలో జరిగిన ఈ విచిత్రమైన వివాహంలో గ్రామస్తులు నాగులకట్టబావి వద్ద మొదట రెండు గాడిదలకు వివాహం చేశారు. తర్వాత అక్కడి నుండి మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో రెండు గాడిదలను గ్రామంలో ఊరేగింపుగా పెద్దమ్మ గుడి వరకు తీసుకెళ్లారు. పెద్దమ్మ గుడి వద్ద గ్రామస్తులంతా ప్రత్యేక పూజలు చేస్తారు.. ఇలా చేస్తే సమృద్ధిగా వర్షాలు కురిసి గ్రామం సస్యశ్యామలంగా ఉంటుందని గ్రామస్తుల నమ్మకం.

అసలే వర్షం లేక అల్లాడిపోతున్న అన్నదాతలు గాడిదలకు పెళ్లి… ప్రత్యేక పూజలతోనైనా వర్షం కురుస్తుందేమో అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. వరుడు గ్రామస్తుల పూజలతోనైనా కరుణించి వర్షం కురిపిస్తాడేమో వేచి చూడాలి. వర్షాల కోసం ఇలా గాడిదలకు పెళ్లి.. కప్పలకు పెళ్లి లాంటి వింత ఆచారాలు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ఈ గ్రామస్తులు కూడా అలాంటి పనే చేసి అందరినీ ఆశ్చర్యపర్చారు.

Follow Us