AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సినిమాకెళ్లొస్తున్న ఫ్రెండ్స్.. అర్ధరాత్రి పాడుబడిన భవనం నుంచి భయంకర సౌండ్స్.. వెళ్లి చూడగా..

అర్ధరాత్రి వేళ.. నిర్మానుష్యమైన పాడుబడిన భవనం.. లోపల హోమగుండం, కోడి రక్తం మరకలు, వింత ముగ్గులు.. కాకినాడ జిల్లా కాజులూరు మండలం తిప్పరాజుపాలెంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న క్షుద్రపూజల వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సినిమా చూసి వస్తున్న యువకుల కంటపడటంతో ఈ చేతబడుల బాగోతం వెలుగులోకి వచ్చింది.

Andhra Pradesh: సినిమాకెళ్లొస్తున్న ఫ్రెండ్స్.. అర్ధరాత్రి పాడుబడిన భవనం నుంచి భయంకర సౌండ్స్.. వెళ్లి చూడగా..
Kakinada Black Magic
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Oct 03, 2026 | 4:07 PM

Share

కాకినాడ జిల్లా కాజులూరు మండలం తిప్పరాజుపాలెంలో క్షుద్రపూజల ఉదంతం తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని ఓ పాడుబడిన పాత భవనంలో గుర్తుతెలియని వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా క్షుద్రపూజలు, చేతబడులు నిర్వహిస్తుండటాన్ని స్థానిక యువకులు గుర్తించారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు అర్ధరాత్రి సినిమా చూసి తిరుగు ప్రయాణంలో ఆ మార్గం గుండా వెళ్తుండగా, పాడుబడిన భవనంలో అనుమానాస్పద కదలికలు కనిపించాయి. లోపలికి వెళ్లి చూడగా క్షుద్రపూజలు చేస్తున్న దృశ్యాలు కంటపడ్డాయి. వెంటనే యువకులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, పూజలు చేస్తున్న వ్యక్తులు చీకటిలో అక్కడి నుంచి పరారయ్యారు.

గ్రామస్థుల ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు

తిప్పరాజుపాలెం శివారు అంచమచెరువుకు చెందిన గుమ్మడి నాగేశ్వరరావు అనే వ్యక్తే బయటి ప్రాంతాల నుంచి తాంత్రికులను రప్పించి ఈ చేతబడులు చేయిస్తున్నాడని గ్రామస్థులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ఊరి ప్రజలు, చిన్నారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పిల్లలను పాఠశాలలకు పంపించాలన్నా భయపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు స్వీకరించిన వెంటనే గొల్లపాలెం ఎస్సై మూర్తి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాడుబడిన భవనాన్ని పరిశీలించగా.. అక్కడ తాంత్రిక పూజల కోసం తవ్విన హోమం గొయ్యి, కోడి రక్తం మరకలు, విచిత్రమైన ముగ్గులు, పువ్వులు, పూజా సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉండటం గుర్తించారు. వీటన్నింటినీ పోలీసులు రికార్డు చేసుకుని, సాక్ష్యాధారాలు సేకరించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

వీడియో చూడండి..

Follow Us
సినిమాకెళ్లొస్తున్న ఫ్రెండ్స్.. అర్ధరాత్రి పాడుబడిన భవనం నుంచి..
సినిమాకెళ్లొస్తున్న ఫ్రెండ్స్.. అర్ధరాత్రి పాడుబడిన భవనం నుంచి..
అమ్మ చేతి రుచితో కోడిగుడ్డు కూర.. చిక్కటి గ్రేవీ కోసం ఇలా చేయండి
అమ్మ చేతి రుచితో కోడిగుడ్డు కూర.. చిక్కటి గ్రేవీ కోసం ఇలా చేయండి
కుజ, బృహస్పతి కలయిక.. వీరు నక్కతోక తొక్కినట్లే
కుజ, బృహస్పతి కలయిక.. వీరు నక్కతోక తొక్కినట్లే
అరచేతిలో ఈ చతురస్రం గుర్తు ఉందా? మీ స్వభావం, అదృష్టం గురించి..
అరచేతిలో ఈ చతురస్రం గుర్తు ఉందా? మీ స్వభావం, అదృష్టం గురించి..
తులం బంగారం పథకం అమలుకు లైన్ క్లియర్.. అప్పటినుంచే..
తులం బంగారం పథకం అమలుకు లైన్ క్లియర్.. అప్పటినుంచే..
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. కోహ్లీ ఎలైట్ క్లబ్‌లోకి ఎంట్రీ
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. కోహ్లీ ఎలైట్ క్లబ్‌లోకి ఎంట్రీ
నారింజ తొక్కతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం!
నారింజ తొక్కతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం!
పుస్తకాలు కొంటానంటూ వచ్చి.. పిన్ నంబర్ చూసి ఫోన్‌తో ఉడాయింపు..
పుస్తకాలు కొంటానంటూ వచ్చి.. పిన్ నంబర్ చూసి ఫోన్‌తో ఉడాయింపు..
పూరీలు నూనె పీల్చకుండా మెత్తగా, పొంగాలంటే పిండిలో ఇది కలపండి..
పూరీలు నూనె పీల్చకుండా మెత్తగా, పొంగాలంటే పిండిలో ఇది కలపండి..
చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..
చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..