AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆ బడిలో ఒకే ఒక్కడు.. ఆ ఒక్కడికి టీచర్‌తో సహా ముగ్గురు సేవలు..!

ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిది విచిత్ర సమస్య... ఆ పంతులు ఉద్యోగం నిలబడాలంటే విద్యార్థి కావాలి.. ప్రస్తుతం ఆ స్కూల్ లో మిగిలిన ఏకైక విద్యార్థిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఉపాధ్యాయుడు తన ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటున్నాడు.. ఆ పాఠశాలలో ఒకే విద్యార్థి ఒకే ఉపాద్యాయుడు... విద్యార్థులు లేక వెలవెలబోతున్న సర్కారు బడి భవితవ్యాన్ని మీరే చూడండి..

Watch Video: ఆ బడిలో ఒకే ఒక్కడు.. ఆ ఒక్కడికి టీచర్‌తో సహా ముగ్గురు సేవలు..!
Single Student Govt School In Warangal
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jul 14, 2026 | 10:28 AM

Share

వరంగల్‌, జులై 14: ఇదీ… వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని కోనాపురం ప్రాథమిక పాఠశాల.. ఈ ప్రభుత్వ పాఠశాలలో ఒకే విద్యార్థి – ఒకే ఉపాధ్యాయుడు. కోనాపురం కు చెందిన ఈరెల్లి ప్రవీణ్ కుమారుడు ఈరెల్లి విక్కీపాల్ ఈ ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి తెలుగు మీడియంలో చదువుతున్నాడు.. అతన్ని ఉపాద్యాయుడు పదిలంగా చూసుకుంటున్నాడు. బాలుడు రానంటే ఇంటికి వెళ్ళి బ్రతిమిలాడి, బుజ్జగించి తీసుకురావాల్సిందే.

ఈ పాఠశాలలో గత 5 సంవత్సరాల క్రితం సుమారు 20మంది విద్యార్థులు ఉండేవారు. వారి తల్లిదండ్రులు ఉపాధికోసం పట్టణ ప్రాంతాలకు వలసవెళ్లారు.. పిల్లలు కూడా వారితో వెళ్లడం వలన. క్రమక్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈ విద్యా సంవత్సరంలో ఒకే ఒక్క విద్యార్థి విక్కీపాల్ మిగిలిపోయాడు. ఐదు సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడి పాత్ర పోషిస్తున్న ఏకోపాధ్యాయుడు జగన్మోహన్ రావు తన ఉద్యోగాన్ని నిలబెట్టు కోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ విద్యార్థికి అన్ని తానై పాఠాలు బోధిస్తున్నాడు.

ఈ విద్యార్థి కోసం పాఠశాలలో ఉపాధ్యాయుడితో పాటు ఒక పనిమనిషి, మధ్యాహ్న భోజనానికి ఒక వంట మనిషి మొత్తం ముగ్గురు పని చేస్తున్నారు. ఈ విద్యార్థి కోసం ప్రతినెల సుమారు లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. గత సంవత్సరం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఉండగా అందులో ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం వలస వెళ్లడంతో వారితో పాటు పిల్లలు కూడా వెళ్లారు. ఈ విద్యా సంవత్సరంలో ఒకే విద్యార్థి మిగిలిపోయినట్లు ప్రధాన ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో నివశిస్తున్న వారికి జీవనోపాధి సమస్య ఈ దుస్తితికి కారణం.. ఉపాధి లేకపోవడంతో బ్రతుకుతెరువు కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. పిల్లలు కూడా కన్నవారితో వెళ్లడంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. విద్యార్థులు లేక పాఠశాల వెలవెల బోతోంది. తల్లిదండ్రులకు జీవనోపాధి కల్పిస్తే ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది ఈ బడి బాగుపడుతుంది.

Follow Us