AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కావాలనే నాపై కక్ష గట్టారు.. వీడియో రికార్డ్‌లు ఉన్నాయంటున్న డాన్సర్ శ్రష్టి వర్మ

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. తెలుగు ఫిల్మ్‌ డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో వివాదంలో జానీ మాస్టర్ భార్య పేరు తెరపైకొచ్చింది. అసోసియేషన్‌ అధ్యక్షురాలు, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ భార్య సుమలతపై కొందరు డ్యాన్సర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కావాలనే నాపై కక్ష గట్టారు.. వీడియో రికార్డ్‌లు ఉన్నాయంటున్న డాన్సర్ శ్రష్టి వర్మ
Shrasti Varma
Rajeev Rayala
|

Updated on: Jul 14, 2026 | 10:59 AM

Share

తెలుగు డ్యాన్స్ కమ్యూనిటీ రెండు బలమైన వర్గాలుగా చీలిపోయింది. ఔనన్నా కాదన్నా ఇది నిజం. ఒక వర్గానికి శేఖర్ మాస్టర్, మరో వర్గానికి జానీ మాస్టర్ నాయకత్వం వహిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుంచో నడుస్తున్న టాక్. అసలు ఈ వివాదం ఏంటి, ఎందుకొచ్చింది అని చెప్పుకోడానికి ముందు.. అసలు ఈ అసోసియేషన్, ఆ సంఘం ప్రెసిడెంట్, ఆ ప్రెసిడెంట్ ఎన్నిక గురించి కూడా చెప్పుకోవాలి. తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్ అసోసియేషన్ ఎన్నికలు గతేడాది డిసెంబర్‌లో జరిగాయి. నిజానికి ఆ ఎన్నికలు జరగడానికి ముందు ఆ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నది జానీ మాస్టరే. అయితే.. శ్రేష్టి వర్మ ఎపిసోడ్ జరగడం, ఆ కేసులో జానీ మాస్టర్ జైలుకు పోవడం, అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. తన ప్లేస్‌లో తన భార్య సుమలతను పోటీకి దించారు జానీ మాస్టర్. ఆ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య సుమలత ఒక్కరే ఒకవైపు, శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, జోజో శ్యామ్ వంటి పెద్దోళ్లంతా మరోవైపు ఉన్నారు. అయినా సరే.. జానీ మాస్టర్ భార్య సుమలత.. తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా గెలిచారు. అసలు వివాదం మొదలైంది కూడా ఆ తరువాత నుంచే.

ఇది కూడా చదవండి : ఐరెన్ లెగ్ అని అవమానించారు.. 9 సినిమాలనుంచి తీసేశారు.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ హీరోయిన్

ప్రెసిడెంట్‌గా సుమలత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది జనరల్ బాడీ సభ్యుల ఆరోపణ. సాధారణంగా.. ఏ అంశం మీదైనా సరే జనరల్ బాడీలో చర్చించి, నిర్ణయం తీసుకుంటారు. కానీ, అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత మాత్రం ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా నిర్ణయాలు ప్రకటించేస్తున్నారని అసోసియేషన్ సభ్యులే మండిపడుతున్నారు. ఆ ఒంటెద్దు పోకడలు నచ్చకనే తాము రాజీనామా చేయాల్సి వచ్చిందని 10 మంది చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేశాడు.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు

ఇదిలా ఉంటే తాజాగా డ్యాన్సర్ శ్రష్టి వర్మ మీడియా ముందుకు వచ్చారు. శ్రష్టి వర్మ కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. అసోసియేషన్ సమావేశంలో జానీ మాస్టర్ అసిస్టెంట్లు కొందరి పై దాడి చేశారని ఆమె అన్నారు. ఇందుకు సంబందించిన వీడియోలు కూడా ఉన్నాయని తెలిపింది. ఎలాంటి అవినీతికి పాల్పడని ఈసీ మెంబర్లను టార్గెట్ చేయడం సరికాదని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే తన పై వ్యక్తిగత కక్ష సాధింపులు జరుగుతున్నాయని ఆమె అన్నారు.గతంలో బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చిన తర్వాత బీబీ జోడి’ విజేతగా నిలిచినందుకు అసోసియేషన్ సభ్యురాలిగా సన్మానం చేయాలని సెక్రటరీ నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి కొందరు తనపై పాత విషయాలను తవ్వుతూ గొడవలు చేస్తున్నారని,  గతంలో తాను జానీ మాస్టర్‌పై కేసు పెట్టాననే ఒకే ఒక్క కారణంతో, ఆయన టీమ్  తనపై కక్ష గట్టారని శ్రష్టి వర్మ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తొలిరాత్రే షాక్ ఇచ్చిన భార్య.. విడాకుల కోసం రెండేళ్లు తిరిగి
తొలిరాత్రే షాక్ ఇచ్చిన భార్య.. విడాకుల కోసం రెండేళ్లు తిరిగి
జాలరి ముఖాన్ని చుట్టేసిన ఆక్టోపస్., ఊపిరాడక మృత్యువు అంచుల్లోకి..
జాలరి ముఖాన్ని చుట్టేసిన ఆక్టోపస్., ఊపిరాడక మృత్యువు అంచుల్లోకి..
వరాలు కురిపిస్తున్న వర మహాలక్ష్మీ.. వీరి జీవితాల్లో గొప్ప మార్పు
వరాలు కురిపిస్తున్న వర మహాలక్ష్మీ.. వీరి జీవితాల్లో గొప్ప మార్పు
10 వేల అడుగుల వాకింగ్ వెనుక పెద్ద బిజినెస్ సీక్రెట్..
10 వేల అడుగుల వాకింగ్ వెనుక పెద్ద బిజినెస్ సీక్రెట్..
రాఖీ పౌర్ణమి 27 లేదా 28నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?
రాఖీ పౌర్ణమి 27 లేదా 28నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?
ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!
ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!
వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే
వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..
మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!
మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!
చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర