AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Debit Card: ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? 99% మందికి తెలియని అసలు కారణం ఇదే!

ATM Card: మీరు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లినప్పుడు డెబిట్‌ కార్డు ఏటీఎం మెషీన్‌లో పెట్టగానే కార్డు పట్టేసుకుంటుంది ఏటీఎం. మరీ ఏటీఎం కార్డును మెషీన్‌ ఎందుకు పట్టుకుంటుందో మీకు తెలుసా..? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

Debit Card: ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? 99% మందికి తెలియని అసలు కారణం ఇదే!
Atm
Subhash Goud
|

Updated on: Aug 19, 2026 | 5:19 PM

Share

Debit Card: బ్యాంక్ ఏటీఎం (ATM) నుండి డబ్బులు డ్రా చేయడానికి వెళ్లినప్పుడు లావాదేవీ పూర్తయ్యే వరకు ఏటీఎం మిషన్ మన డెబిట్ లేదా క్రెడిట్ కార్డును లోపలే పట్టుకుని ఉంచుతుందని మీరు గమనించే ఉంటారు. నగదు వచ్చేవరకు కార్డు బయటకు రాదు. అసలు ఏటీఎం మిషన్లు ఇలా కార్డును ఎందుకు లోపల లాక్ చేస్తాయి? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసుకుందాం.

  1. సమాచారం భద్రత (కార్డు చిప్ టెక్నాలజీ):ప్రస్తుతం వచ్చే ప్రతి బ్యాంక్ కార్డులోనూ ఒక మైక్రోచిప్ (EMV Chip) ఉంటుంది. దీనికి విద్యుత్ కనెక్షన్ అవసరం. ఏటీఎం మిషన్‌లో కార్డు సరిగ్గా లాక్ అయినప్పుడు మాత్రమే చిప్‌లోని డేటా ఏటీఎమ్‌కు ప్రసారమై, లావాదేవీ సురక్షితంగా పూర్తవుతుంది.
  2. స్కిమ్మింగ్, సైబర్ మోసాలకు చెక్: పాత కాలపు ఏటీఎంలలో కార్డును డిప్ చేసి వెంటనే బయటకు తీసే వెసులుబాటు ఉండేది. అయితే, దీనివల్ల సైబర్ నేరగాళ్లు ఏటీఎం కార్డు స్లాట్ వద్ద నకిలీ ‘కార్డు రీడర్లు’ (Card Skimmers) అమర్చి డేటాను దొంగిలించేవారు. కానీ ఇప్పుడున్న ఆధునిక ఏటీఎంలలో కార్డును లోపల లాక్ చేసే సిస్టమ్ రావడం వల్ల ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట పడింది.
  3. కార్డును మరిచిపోకుండా నిరోధించడం: గతంలో డబ్బులు డ్రా చేసిన తొందరలో చాలామంది తమ కార్డులను ఏటీఎం మిషన్‌లోనే మరిచిపోయి వెళ్లిపోయేవారు. కానీ, ప్రస్తుత లాకింగ్ ఫీచర్ వల్ల లావాదేవీ పూర్తయిన తర్వాతే కార్డు బయటకు వస్తుంది. దీనివల్ల వినియోగదారులు కార్డును మరిచిపోయే అవకాశం ఉండదు.
  4. దొంగిలించిన లేదా బ్లాక్ అయిన కార్డులను గుర్తించడం: ఒకవేళ మీ కార్డు పోయినా లేదా దొంగిలించబడినా, మీరు బ్యాంక్‌కు ఫిర్యాదు చేసి దానిని బ్లాక్ చేయిస్తారు. ఆ తర్వాత ఎవరైనా దొంగ ఆ కార్డును ఏటీఎమ్‌లో ఉపయోగిస్తే, ఏటీఎం ఆటోమేటిక్‌గా దానిని గుర్తించి (Detect చేసి) కార్డును తిరిగి బయటకు రాకుండా మిషన్ లోపలే పట్టుకుంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సాంకేతిక లోపాలు లేదా పొరపాట్లు: కొన్నిసార్లు మీరు వరుసగా 3 సార్లు తప్పు పిన్ (PIN) ఎంటర్ చేసినా లేదా కార్డు తీసుకునే సమయంలో ఆలస్యం చేసినా భద్రతా కారణాల దృష్ట్యా ఏటీఎం మిషన్ ఆ కార్డును లోపలే ఉంచుకుంటుంది. ఒకవేళ ఏటీఎం మీ కార్డును లోపల ఉంటే ఏం చేయాలి?

వెంటనే బ్యాంక్‌కు సమాచారం ఇవ్వండి: ఏటీఎం కేంద్రంలో ఉండే కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయించండి.

యాప్ ద్వారా బ్లాక్ చేయండి: మీ వద్ద మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఉంటే, తక్షణమే కార్డును తాత్కాలికంగా ఫ్రీజ్/బ్లాక్ చేయవచ్చు.

బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించండి: ఆ ఏటీఎం ఏ బ్యాంక్‌కు చెందినదో ఆ బ్రాంచ్‌కు వెళ్లి ఫిర్యాదు చేసి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Success Story: రూ.10 వేలతో మొదలుపెట్టి రూ.3 కోట్లు.. వీటి సాగుతో రికార్డు సృష్టించిన అన్నదమ్ములు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us