AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు.. ప్రజావాణిలో వృద్ధుడి కన్నీటి గాథ!

కంటికి రెప్పలా పెంచిన చేతులే ఈరోజు ఆకలితో అల్లాడిపోతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను ప్రయోజకులను చేసిన ఆ తండ్రికి, చివరకు బుక్కెడు అన్నం పెట్టే నాథుడే కరువయ్యాడు. ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా ఆ వృద్ధుడు ఆకలి తీర్చుకోవడానికి ఊరంతా భిక్షాటన చేయాల్సి వస్తోంది. మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన సమాజంలో మానవ సంబంధాలు ఎంత దిగజారిపోతున్నాయో చాటిచెబుతోంది.

ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు.. ప్రజావాణిలో వృద్ధుడి కన్నీటి గాథ!
Father Begs Sons For Food
P Shivteja
| Edited By: |

Updated on: Aug 19, 2026 | 5:24 PM

Share

కన్నప్రేమ కరువైంది..కంటికి రెప్పలా పెంచిన చేతులే కన్నీరు పెడుతున్నాయి..ఎనిమిది మంది కొడుకులు..ఐదుగురు కూతుర్లు.. అందరికీ రెక్కలు ముక్కలు చేసుకుని పెళ్లిళ్లు చేశాడు ఆ తండ్రి.ఒక ఇల్లు, మూడు ఎకరాల భూమి సంపాదించి ఇచ్చాడు. కానీ, ఈరోజు ఆ వృద్ధ తండ్రికి బుక్కెడు అన్నం పెట్టే నాథుడే కరువయ్యాడు..నా కొడుకులకు చెప్పి నాకు అన్నం పెట్టించండి సార్.. మీ కాళ్లు మొక్కుతా అంటూ ఆ వృద్ధుడు ప్రజావాణిలో అధికారుల ముందు బోరున విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది..పూర్తి వివరాల్లోకి వెళ్తే

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాపేట గ్రామానికి చెందిన ఎంబీ మహబూబ్ కథ ఇది. ఒకప్పుడు అందరిలాగే పచ్చని సంసారం..ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుర్లతో కళకళలాడిన ఇల్లు. తనకున్న కొద్దిపాటి ఆస్తి, గేదెలను అమ్మి వచ్చిన డబ్బును కూడా కొడుకులకే ఇచ్చాడు. పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి బాధ్యత తీర్చుకున్నాడు..కానీ, ఆరేళ్ల క్రితం భార్య మరణించడంతో మహబూబ్ జీవితం ఒక్కసారిగా తలకిందులుగా అయ్యింది..అయితే ఎనిమిది మంది కొడుకుల్లో ఏడుగురు హైదరాబాద్‌లో స్థిరపడగా,పెద్ద కొడుకు ఊర్లోనే ఉంటున్నాడు. అయినా గత ఏడాది కాలంగా ఈ వృద్ధుడికి కనీసం అన్నం పెట్టే దిక్కు లేకుండా పోయింది..

ఆకలి తట్టుకోలేక ఎండావానా అని తేడా లేకుండా ఊళ్లో ఇంటింటికీ తిరుగుతూ భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటున్నాడు. కూలిపోయిన తన పాత ఇంట్లో ఒక పక్కన పడుకుంటూ నరకయాతన అనుభవి స్తున్నాడు…వయసు పై బడటంతో భిక్షాటన చేసే ఓపిక కూడా లేక..నాకు బుక్కెడు అన్నం పెట్టండి అని కొడుకులకు ఫోన్ చేసి వేడుకున్నా ఆ పాషాణ హృదయులు కరగలేదు. దీంతో వారం రోజుల క్రితం చేసేదేమీ లేక మహబూబ్ పోలీసులను ఆశ్రయించాడు..పోలీసులు కొడుకులకు సమాచారం ఇచ్చినా ఎవరూ రాలేదు. కొడుకులు వస్తారేమో, తనను తీసుకెళ్తారేమో అన్న ఆశతో ఆ వృద్ధుడు ఏకంగా మూడు రోజుల పాటు రాత్రింబవళ్లు పోలీస్ స్టేషన్‌లోనే పడుకుని ఎదురుచూశాడు..చివరకు పోలీసులు స్థానిక సర్పంచ్ అశోక్ రెడ్డికి సమాచారం అందించడంతో, ఆయన వచ్చి వృద్ధుడిని గ్రామానికి తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

కొడుకులు రాకపోవడంతో సోమవారం నాడు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చేందుకు మహబూబ్ ఎంపీడీవో వెంకటలక్ష్మి వద్దకు వచ్చాడు..అధికారుల కాళ్లు మొక్కుతూ..మేడం.. నాకు బుక్కెడు అన్నం పెట్టమని నా కొడుకులకు చెప్పండి అంటూ బోరున ఏడ్చాడు..నా భార్య బతికుంటే నాకు ఈ గతి పట్టేది కాదు అంటూ భార్యను తలుచుకుని విలపించిన తీరు ప్రజావాణికి వచ్చిన వారందరినీ కంటతడి పెట్టించింది. ఫిర్యాదు ఇచ్చి ఏడుస్తూనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ అభాగ్యుడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కారం కారంగా.. అదిరిపోయే రుచితో కోడిగుడ్డు కారం!
కారం కారంగా.. అదిరిపోయే రుచితో కోడిగుడ్డు కారం!
మీ అలవాట్లే మీ భవిష్యత్తు.. బద్ధకం వల్ల ఏం జరుగుతుందో తెలిపే కథ
మీ అలవాట్లే మీ భవిష్యత్తు.. బద్ధకం వల్ల ఏం జరుగుతుందో తెలిపే కథ
మైదానంలోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ డేట్ ఫిక్స్
మైదానంలోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ డేట్ ఫిక్స్
శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం
శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం
క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు అదనంగా 2 శాతం అడుగుత
క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు అదనంగా 2 శాతం అడుగుత
ఆయనతో సినిమా చేయడం అంటే హాలీవుడ్ ప్రాజెక్ట్ చేసినట్టే
ఆయనతో సినిమా చేయడం అంటే హాలీవుడ్ ప్రాజెక్ట్ చేసినట్టే
దీని ముందు చికెన్, మటన్ కూడా పనికిరావు.. చిటికెలోనే రెడీ ..
దీని ముందు చికెన్, మటన్ కూడా పనికిరావు.. చిటికెలోనే రెడీ ..
శ్రీ గణేశుడి 108 పవిత్ర నామాలు.. ఒక్కో పేరులో దాగున్న అర్థం ఇదే!
శ్రీ గణేశుడి 108 పవిత్ర నామాలు.. ఒక్కో పేరులో దాగున్న అర్థం ఇదే!
దుమ్ముదుమారం.. 22Aపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..
దుమ్ముదుమారం.. 22Aపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..
శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ల మెగా హబ్.. ప్రభుత్వం నుంచి అప్డేట్..
శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ల మెగా హబ్.. ప్రభుత్వం నుంచి అప్డేట్..