AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: 9/11 తరహా విపత్తును అడ్డుకున్న పైలట్ స్మిత్‌కు సెల్యూట్.. యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో మెదీ ప్రశంసలు..

దేశ పరిపాలనా రంగానికి వెన్నెముకగా నిలిచిన యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల వేదికగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. విమానంలో 9/11 తరహా ఘోర విషాదాన్ని సమయస్ఫూర్తితో అడ్డుకున్న భారత పైలట్ కెప్టెన్ స్మిత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించిన శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని, UPSC మైలురాయిని గుర్తుచేయడంతో పాటు దేశం గర్వించదగ్గ పైలట్ సాహసాన్ని కొనియాడారు.

PM Modi: 9/11 తరహా విపత్తును అడ్డుకున్న పైలట్ స్మిత్‌కు సెల్యూట్.. యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో మెదీ ప్రశంసలు..
Pm Modi Hails Captain Smit At Upsc Centenary Event
Krishna S
|

Updated on: Oct 01, 2026 | 12:16 PM

Share

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఘనంగా నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సివిల్ సర్వెంట్లు, UPSC ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, అంతకుముందు రోజు విమానంలో జరిగిన కుట్రను ధైర్యసాహసాలతో అడ్డుకున్న భారత పైలట్ కెప్టెన్ స్మిత్‌ను కొనియాడారు. తన ప్రసంగం ప్రారంభంలోనే కెప్టెన్ స్మిత్ ప్రదర్శించిన తెగువను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

కెప్టెన్ స్మిత్‌కు మోదీ సెల్యూట్

‘‘బుధవారం జరిగిన ఘటనలో భారత్‌కు చెందిన కెప్టెన్ స్మిత్ అద్భుతమైన ఓర్పు, సమయస్ఫూర్తి, ధైర్యాన్ని చాటారు. నేడు ఇజ్రాయెల్ ప్రధాని చెప్పినట్లుగానే.. ఒక భారతీయుడు మరో 9/11 తరహా పెను విషాదం జరగకుండా అడ్డుకున్నారు’’ అని ప్రధాని ప్రశంసించారు.

UPSC శతాబ్ది ఉత్సవాల విశేషాలు

అక్టోబర్ 1, 1926న ఏర్పాటైన UPSC దేశ పరిపాలనా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచి శతాబ్ది వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని ప్రధాని మోదీ UPSC శతాబ్ది స్మారక నాణెం, ప్రత్యేక తపాలా స్టాంపును విడుదల చేశారు. UPSC, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విధానాల రూపకల్పనపై వచ్చిన కీలక తీర్పులతో కూడిన ‘‘100 Landmark Judgements – Shaping the Policies of UPSC and Public Service Commissions in India’’ పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. దేశ సమగ్ర అభివృద్ధి, పాలనా సంస్కరణలు, ఆధునిక సాంకేతికత వినియోగంపై సివిల్ సర్వెంట్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని, వికసిత్ భారత్ నిర్మాణంలో అధికారుల పాత్ర కీలకమని ప్రధాని దిశానిర్దేశం చేశారు.

కెప్టెన్ స్మిత్ సాహస నేపథ్యం

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ కత్తితో దాడికి పాల్పడగా, తీవ్ర గాయాలైనా లెక్కచేయకుండా కెప్టెన్ స్మిత్ ఎదురొడ్డి పోరాడారు. కాక్‌పిట్ తలుపు తెరిచి సిబ్బంది, ప్రయాణికుల సాయంతో అతడి ఆట కట్టించి.. విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసి 174 మంది ప్రాణాలను కాపాడారు. ఈ సాహసాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.

Follow Us