AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కింగ్ నాగార్జున అన్నయ్య అనే పిలిచే ఏకైక హీరో ఎవరో తెలుసా.?

వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కుర్రహీరోలతో పోటీ పడుతూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. కేవలం హీరోగానే కాదు ఇటీవల రూట్ మార్చి సహాయక పాత్రల్లో అలాగే విలన్ గానూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు నాగ్ 100వ సినిమా కోసం రెడీ అవుతున్నారు.

కింగ్ నాగార్జున అన్నయ్య అనే పిలిచే ఏకైక హీరో ఎవరో తెలుసా.?
Nagarjuna
Rajeev Rayala
|

Updated on: Jul 14, 2026 | 8:42 AM

Share

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. త్వరలోనే తన 100వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు నాగ్. నాగ్ హీరోగా సినిమాలు చేస్తూనే సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నారు. మొన్నటివరకు హీరోగా సోలో సినిమాలు చేసిన నాగ్.. ఆ తర్వాత ట్రాక్ మార్చి సహాయక పాత్రతో పాటు విలన్ గానూ సినిమా చేసి మెప్పించారు నాగార్జున. తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించినకుబేర సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించారు నాగార్జున. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి అదరగొట్టారు నాగార్జున.

ఇక ఇప్పుడు మరోసారి సోలో హీరోగా సినిమా చేస్తున్నారు. నాగ్ త్వరలోనే తన కెరీర్ లో 100వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో అఖిల్, నాగ చైతన్య గెస్ట్ రోల్స్ చేస్తున్నారని ప్రచారం జోరుగా జరుగుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అలాగే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ టబు నటిస్తుందని తెలుస్తుంది. అది కూడా ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే నాగార్జున ఇండస్ట్రీలో అన్నయ్య అని పిలిచే ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా.? ఈ విషయాన్నీ నాగార్జుననే ఓ సందర్భంలో స్టేజ్ పై పంచుకున్నారు. నాగార్జున అన్నయ్య అని పిలిచే హీరో మరెవరో కాదు దివంగత నటుడు నందమూరి హరికృష్ణ. నాగ్, హరి కృష్ణ మధ్య మంచి బాండింగ్ ఉండేది. అలాగే నాగార్జున, హరికృష్ణ కలిసి సీతారామరాజు అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో నాగ్, హరికృష్ణ అన్నదమ్ములుగా కనిపించారు. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి హరికృష్ణను హరి అన్న అని పిలుస్తుంటారు నాగార్జున. హరికృష్ణ మరణం తనను ఎంతగానో బాధపెట్టిందని నాగార్జున గతంలో ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలిపారు. నందమూరి హరికృష్ణను హరి అన్నయ్య అని పిలుస్తా.., ఆ బంధం గురించి మాటల్లో చెప్పలేను. ఆయన మరణవార్త తన పుట్టినరోజు నాడే వచ్చిందని ఎమోషనల్ అయ్యారు నాగార్జున.

Harikrishna, Nagarjuna

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర