AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetable Prices: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ఉల్లిపాయల ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?

సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. ఉల్లిపాయల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత నెలలో రూ.20కే లభింగా.. ఇప్పుడు రూ.40 నుంచి రూ.50 మధ్య పలుకుతున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో దిగుబడి తగ్గడం, ఆలస్యంగా పంట సాగు మొదలుకావడంతో డిమాండ్ పెరిగింది. దీంతో ధరలు పెరుగుతున్నాయి.

Vegetable Prices: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ఉల్లిపాయల ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
Onion Prices
Venkatrao Lella
|

Updated on: Aug 20, 2026 | 1:28 PM

Share

సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పంచదార ధరలు పెరగుతుండగా.. ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఉల్లిపాయల ధరలు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. మొన్నటివరకు కిలో రూ.20కే లభించగా.. ఇప్పుడు రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతున్నాయి. దీంతో ఉల్లి సామాన్యులపై భారం పెంచుతోంది. పేదల జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిప్తోంది. ఎల్‌నివో ప్రభావం వల్ల ఖరీఫ్ ఉల్లి పంటలో జాప్యం జరగడంతో సరఫరా తగ్గిపోయింది. ఈ కారణంతో మార్కెట్‌పై ఒత్తిడి పెరగడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వివిధ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

హైదరాబాద్‌లో కూరగాయల రేట్లు ఇవే..

హైదరాబాద్‌లోని కూకట్ పల్లి రైతు బజార్‌లో కిలో టమోటా రూ.15, వంకాయ రూ.28, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.45, బజ్జిమిర్చి రూ.55, కాకరకాయ రూ.32, బీరకాయ రూ.38, క్యాబేజీ రూ.17, బీన్స్ రూ.75, క్యారెట్ రూ.45, గోబీపువ్వు రూ.25, దొండకాయ రూ.28, చిక్కుడుకాయ రూ.70, గోరుచిక్కుడు రూ.28, బీట్‌రూట్ రూ.32, క్యాప్సికం రూ.33, ఆలుగడ్డ రూ.18, కీర రూ.18, దోసకాయ రూ.15, సొరకాయ రూ.15, పొట్లకాయ రూ.23, కంద రూ.35, ఉల్లిపొరక రూ.45, ఉల్లిగడ్డ రూ.40, మామిడికాయ రూ.15–20, అరటికాయ రూ.10–11, చామగడ్డ రూ.28, ముల్లంగి రూ.6–8, చిలగడదుంప రూ.35, గుమ్మడికాయ రూ.40, నిమ్మకాయలు రూ.40–50, మునగకాయలు రూ.6–8, పచ్చిబఠాణి రూ.40, బొప్పాయి రూ.40, పుట్టగొడుగులు రూ.45, ఎండుమిర్చి రూ.260, అల్లం రూ.140, వెల్లుల్లి రూ.220, చింతపండు రూ.160, పండుమిర్చి రూ.80, ఉసిరి కూ.120, కరివేపాకు రూ.50, పర్వల్ రూ.45, పల్లికాయ రూ.60 పలుకుతున్నాయి.

విజయవాడలో ధరలు ఇవే..

విజయవాడలోని రైతు బజార్లలో కిలో టమాట రూ.25, వంగ రూ.32, బెండ రూ.15, పచ్చిమిర్చి రూ.48, కాకర రూ.32, క్యాబేజీ రూ.26, క్యారెట్ రూ.42, దొండ రూ.24, బంగాళదుంప రూ.25, ఉల్లిపాయలు రూ.40, గోరుచిక్కుడు రూ.28, దోస రూ.18, సొర రూ.10.08, అరటికాయ రూ.78, చిక్కుళ్లు రూ.35, బీర రూ.30, చామదుంప రూ.38, మునగ రూ.06/05, కంద రూ.34, బీట్ రూట్ రూ.40, కీరదోస రూ.54, బీన్స్ రూ.100, క్యాప్సికం రూ.50, అలసందలు రూ.30, చిలకడదుంప రూ.46, కొత్తమీర రూ.22 పలుుతుంది.

Follow Us