AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు మా అమ్మ ముందే కమిట్‌మెంట్ అడిగారు.. ఆ తర్వాత

నటి వితిక షేరు తన 16 ఏళ్ల వయసులో టాలీవుడ్‌లో ఆడిషన్‌కు వెళ్ళినప్పుడు ఎదుర్కొన్న సంఘటనను వెల్లడించారు. అన్నీ ఓకే అయిన తర్వాత, ఆమె తల్లి సమక్షంలోనే కమిట్‌మెంట్ అడిగారు. దీనిని ఆమె, ఆమె తల్లి తిరస్కరించారు. ఈ సంఘటన తర్వాత, చాలా అవకాశాలు కోల్పోయినా, ఆమె తమిళ సినీ పరిశ్రమలో ప్రయత్నించారు.

నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు మా అమ్మ ముందే కమిట్‌మెంట్ అడిగారు.. ఆ తర్వాత
Vithika Sheru
Ram Naramaneni
|

Updated on: Apr 12, 2026 | 9:43 AM

Share

సినీ పరిశ్రమలో కమిట్‌మెంట్‌ల పేరుతో ఎదురయ్యే సమస్యలు బహిరంగ రహస్యమే అని వితిక షేరు ఇటీవల వెల్లడించారు. 16 ఏళ్ల వయసులో తాను ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని ఆమె పంచుకుంటూ, అలాంటి సంఘటనలు కేవలం సినీ పరిశ్రమలోనే కాకుండా ప్రతి రంగంలోనూ జరుగుతాయని పేర్కొన్నారు. కనిపించేవి కొన్ని, కనిపించనివి మరెన్నో అని ఆమె వివరించారు. దాదాపు 14 ఏళ్ల క్రితం, తనకు 16 ఏళ్లు ఉన్నప్పుడు, హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో జరిగిన ఒక ఆడిషన్‌కు తన తల్లితో కలిసి వెళ్ళినట్లు నటి తెలిపారు. ఆడిషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయి, పాత్రకు ఆమెను ఎంపిక చేసినట్లు చెప్పిన తర్వాత, “కమిట్‌మెంట్” గురించి అడిగారు. ఈ సమయంలో తనను బయటకు పంపి.. తన తల్లితో కమిట్‌మెంట్ గురించి మాట్లాడినట్లు వివరించారు. అయితే, ఆ మాట విన్న వెంటనే.. ఆమె కుమార్తెను లోపలికి పిలిపించారు.

అప్పటికే 16 ఏళ్లు ఉన్నప్పటికీ, తనకు ప్రపంచం గురించి, చుట్టూ జరుగుతున్న పరిణామాల గురించి మంచి అవగాహన ఉందని వితిక చెప్పారు. కమిట్‌మెంట్ అనే పదం అర్థం తనకు తెలుసని, దాని పరిణామాలు కూడా అర్థమయ్యాయని ఆమె వివరించారు. తన తల్లి, తన మధ్య ఎటువంటి రహస్యాలు లేవని, అందుకే తల్లి వెంటనే స్పందించారని తెలిపారు. కమిట్‌మెంట్ గురించి అడిగిన వ్యక్తితో, తాము అలాంటి వాటికి ఆసక్తి చూపబోమని, సినిమా కథ నచ్చినప్పటికీ, రెమ్యునరేషన్ లేకుండా అయినా చేస్తానని, కానీ ఇలాంటి కమిట్‌మెంట్‌లు అంగీకరించబోనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇద్దరూ చెప్పి వచ్చేశారు. అయితే, ఆ సినిమా గురించి సజీషన్ ఇచ్చిన వ్యక్తికి విషయం తెలియజేయగా, తర్వాతి రోజు సదరు దర్శకుడు తనకు కాల్ చేసి, ఇలాంటి విషయాలు బయట ఎందుకు చెప్పావని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన విషయాన్ని మాత్రమే చెప్పానని, అది వింటేనే అంత కోపం వస్తే, అక్కడ బాధితురాలిగా ఉన్న తనకి ఎంత కోపం రావాలని నటి ప్రశ్నించారు. ఈ అనుభవం తర్వాత, తాను చాలా సినిమాలు వదులుకున్నానని, “మనకు సెట్ కావులే” అని చాలా అవకాశాలను తిరస్కరించానని ఆమె తెలిపారు. ఆ తర్వాత తమిళ సినీ పరిశ్రమలో ప్రయత్నించినట్లు, అక్కడ ఇలాంటి అనుభవాలు పెద్దగా ఎదురుకాలేదని, ఎందుకంటే తాను అక్కడి స్థానికురాలిని కాదని, షూటింగ్‌కి వెళ్లి వచ్చేదానిని అని వివరించారు. అయితే, “మన ఇండస్ట్రీలో” మాత్రం అలాంటివి ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు.

Also Read: మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి.. 

Follow Us