ప్రభాస్ కళ్లద్దాలు చూసి కొనాలనుకునేరు.. వాటి ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది !!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో డార్లింగ్ చిన్ననాటి ఫోటోస్, రేర్ పిక్స్ షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెబుతున్నారు ఫ్యాన్స్. అలాగే ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న రాజాసాబ్ నుంచి ఇప్పటికే ప్రభాస్ కొత్త పోస్టర్ బయటికి వచ్చింది. అందులో స్టైలీష్ అండ్ కూల్ లుక్ లో కనిపిస్తున్నారు డార్లింగ్.
టీ-షర్ట్‌పై చెక్డ్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, ట్రెండీ సన్ గ్లాసెస్ ధరించి అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇన్నాళ్లు మాస్ లుక్ లో కనిపించిన ప్రభాస్.. ఇప్పుడు స్టైలీష్ లుక్ తో వింటేజ్ డార్లింగ్ ను గుర్తు చేస్తుండడంతో ..ఈ పోస్టర్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. దాంతో పాటే ప్రభాస్ ధరించిన సన్ గ్లాసెస్ పైకి అందరి దృష్టి వెళుతోంది. దాంతో పాటే ఈ సన్ గ్లాసెస్ రేట్ కూడా ఇప్పుడందరినీ షాకయ్యేలా చేస్తోంది. ఇక రాజాసాబ్ నుంచి బయటికి వచ్చి పోస్టర్‌లో ప్రభాస్ ధరించిన సన్ గ్లాసెస్ సాధారణ సన్ గ్లాసెస్ కావు- అవి లూయిస్ విట్టన్ బ్రాండ్‌కు చెందిన లగ్జరీ షేడ్స్. ఇక వీటి ధర విషయానికి వస్తే.. ఈ బ్రాండెడ్ షేడ్స్ ధర … అక్షరాల 88,000 రూపాయలు. అయితే ప్రభాస్ ఈ షేడ్స్ పెట్టుకోవడం వల్ల.. ఇప్పుడీ సన్ గ్లాసెస్ పై తెలుగు యూత్ మనసు పారేసుకుంది. ఈ షేడ్స్‌కోసం ఈ కామర్స్ సైట్స్‌లో తెగ సెర్చ్ చేస్తోంది. దాంతో పాటే.. ఈ గ్లాసెస్ రేట్కు చూసి షాకవుతోంది. కాపీ బ్రాండ్ వైపు ఓ లుక్కేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డార్లింగ్ హీరోకు మెగా స్టార్.. క్రేజీ బర్త్‌డే విషెస్
అర రోజు కష్టపడితే.. భారీగా రెస్పాన్స్ !! ‘రోలెక్స్’ సినిమాపై సూర్య అప్డేట్