Actress : నిరీక్షణ సినిమాతో జీవితం మారిపోయింది.. కానీ ఇండస్ట్రీకి దూరంగా ఉండటానికి కారణం అదే.. నటి అర్చన..
నిరీక్షణ.. తెలుగు చిత్రపరిశ్రమలో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్. ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇందులోని పాటలు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా అప్పుడు, ఇప్పుడు యువత ఈ మూవీకి అభిమానులే. అయితే ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్ అర్చన.. ఆ తర్వాత మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. ఇందుకు గల కారణాన్ని వెల్లడించారు.

`నిరీక్షణ` చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ అర్చన, ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం, భవిష్యత్ ప్రణాళికల గురించి పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించినప్పటికీ, చిన్నతనంలోనే చెన్నైకి వలస వచ్చి తమిళ సంస్కృతికి అలవాటు పడ్డారు. తన తల్లి ప్రోత్సాహంతో తెలుగు భాషను మర్చిపోలేదని తెలిపారు.. నటిగా కంటే ముందు ఒక ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్‌గా స్థిరపడాలనేది అర్చన చిన్ననాటి కల. భరతనాట్యం, కథక్, కూచిపూడి వంటి మూడు నృత్యాలలో ఆమె శిక్షణ పొందారు. అయితే అనుకోకుండా సినిమా రంగంలోకి వచ్చినట్లు తెలిపారు. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంటున్నప్పుడు, అమెరికన్ డైరెక్టర్ విలియం గ్రీవ్స్ నిర్వహించిన వర్క్‌షాప్‌లో నాజర్‌తో కలిసి ఒక సీన్ ప్రాక్టీస్ చేశారు. వీరి ప్రతిభను గుర్తించిన విలియం గ్రీవ్స్, వీరిద్దరినీ ప్రముఖ దర్శకుడు బాలూ మహేంద్ర వద్దకు తీసుకెళ్లారు. అలా అర్చన సినీ ప్రవేశం బాలూ మహేంద్ర దర్శకత్వంలో `నింగల్ కేట్టవై` అనే తమిళ చిత్రంతో జరిగింది.
ఎక్కువ మంది చదివినవి : Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..
తెలుగులో దాసరి నారాయణరావు `ఎమ్మెల్యే ఏడుకొండలు` చిత్రంలో ఒక చిన్న పాత్రలో పరిచయమయ్యారు. హీరోయిన్‌గా ఆమె తొలి తెలుగు చిత్రం బాలూ మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన `నిరీక్షణ`. ఈ సినిమాలో ఆమె చిన్న ఏజ్‌లోనే గిరిజన యువతి పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు పొందారు. అర్చన కెరీర్‌లో `పిరవి`, `దాసి` చిత్రాలు ఆమెకు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. షాజీ ఎన్. కరున్ దర్శకత్వం వహించిన `పిరవి` చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు (ప్రేమ్‌జీ) విభాగాలలో జాతీయ అవార్డులు లభించాయి. ఈ చిత్రం కాన్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన మొట్టమొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. అదే సంవత్సరంలో బి. నర్సింగరావు దర్శకత్వంలో వచ్చిన `దాసి` చిత్రానికి ఐదు జాతీయ అవార్డులు దక్కాయి. వీటిలో ఉత్తమ నటిగా అర్చన అవార్డును అందుకున్నారు. ఒకే సంవత్సరంలో ఆమె నటించిన రెండు చిత్రాలకు తొమ్మిది జాతీయ అవార్డులు రావడం, అలాగే స్వయంగా రెండు జాతీయ అవార్డులు (ఆమె చెప్పిన దాని ప్రకారం) అందుకున్న దక్షిణ భారత నటిగా రికార్డు సృష్టించారు. `దాసి` చిత్రం ఆ రోజుల్లో దాసీల దుర్భర జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిందని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..
సుదీర్ఘ విరామం తర్వాత, `షష్టిపూర్తి` అనే తెలుగు చిత్రంతో అర్చన మళ్ళీ ప్రేక్షకులను పలకరించారు. ఇది రీఎంట్రీ అని భావించడం లేదని, తనకు నచ్చిన పాత్రలు వచ్చినప్పుడల్లా నటిస్తానని ఆమె పేర్కొన్నారు. చిత్ర దర్శకులతో ఎప్పుడూ సౌకర్యంగా ఉంటానని, వారి సూచనలను పాటిస్తానని ఆమె చెప్పారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఈ దుర్మార్గుడే సర్.. ఆ నటుడిపై చిరంజీవికి కంప్లైంట్ చేసిన సౌందర్య.. అసలేం జరిగిందంటే..
ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..
