AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఇదే.. ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతంటే.. శ్యామల దేవి కామెంట్స్..

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు ప్రభాస్. ఇటీవలే రాజాసాబ్ సినిమాతో థియేటర్లలో సందడి చేసిన డార్లింగ్.. ఇప్పుడు ఫౌజీ, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం డార్లింగ్ వయసు 46 సంవత్సరాలు. ఇప్పటికీ తన ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. తాజాగా ప్రభాస్ డైట్ సీక్రెట్ రివీల్ చేశారు ఆయన పెద్దమ్మ శ్యామల దేవి.

Prabhas : ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఇదే.. ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతంటే.. శ్యామల దేవి కామెంట్స్..
Shyamala Devi, Prabhas
Rajitha Chanti
|

Updated on: Apr 12, 2026 | 10:01 AM

Share

దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, ఆయన జీవితం, ఆహారపుటలవాట్లు, అలాగే తన మేనల్లుడు ప్రభాస్ అభిరుచుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కృష్ణంరాజు భోజన ప్రియులని, అతిథుల పట్ల అపారమైన ఆతిథ్యం చూపేవారని ఆమె వివరించారు. ఎవరైనా ఇంటికి వస్తే వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను ముందుగానే అడిగి తెలుసుకుని, స్వయంగా వడ్డించేవారని తెలిపారు. తన ఇంట్లో తయారుచేసే చేపల పులుసు, బిర్యానీ, రొయ్యల కూర, అలాగే పులావ్ రసం కలయిక చాలా రుచిగా ఉంటుందని, అది అందరికీ ఇష్టమని శ్యామలా దేవి పేర్కొన్నారు. ముఖ్యంగా, పులస చేపల పులుసు అంటే కృష్ణంరాజుతో పాటు ప్రభాస్ కు కూడా ఎంతో ఇష్టమని చెప్పారు. ఈస్ట్, వెస్ట్ గోదావరి ప్రాంతాల నుండి మంచి పులస చేప దొరికితే వెంటనే తమ ఇంటికి తీసుకువచ్చేవారని, దానిని వండటం కృష్ణంరాజు తనకు నేర్పారని ఆమె తెలిపారు. ప్రభాస్ కూడా తన డైట్ ఉన్నప్పటికీ, పులస చేపల పులుసు కోసం “పెద్ద బాజి, ఈరోజు నాకు చీట్ డే” అని చెప్పి ఇష్టంగా తినేవారని గుర్తుచేసుకున్నారు. కృష్ణంరాజు ఆహారాన్ని రుచి చూడకుండానే, కేవలం వాసనతో ఉప్పు సరిపోయిందో లేదో చెప్పగలిగేవారని శ్యామలా దేవి అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఈ దుర్మార్గుడే సర్.. ఆ నటుడిపై చిరంజీవికి కంప్లైంట్ చేసిన సౌందర్య.. అసలేం జరిగిందంటే..

కృష్ణంరాజు గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, ఆయన సంపూర్ణమైన జీవితాన్ని గడిపారని, ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఎప్పుడూ నవ్వుతూ, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా జీవించారని తెలిపారు. ఆయన స్నేహితులు లండన్ నుండి వచ్చినప్పుడు కూడా, వారి అభిరుచులను తెలుసుకుని వంటలు చేయించేవారని చెప్పారు. షాపింగ్ విషయంలో కూడా కృష్ణంరాజుకి ఒక ప్రత్యేకమైన అభిరుచి ఉండేదని, ఒక దుకాణంలో నచ్చిన వస్తువులు దొరికితే డజన్ల కొద్దీ కొనేవారని ఆమె వివరించారు. విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు, ప్రభాస్ తో సహా కుటుంబ సభ్యులందరికీ ఎన్నో బహుమతులు కొని తెచ్చేవారని, ప్రభాస్ తనకు ఇచ్చిన రోలెక్స్ వాచ్ ను కృష్ణంరాజు ఎంతగానో ఆదరించేవారని, అది కొడుకు ఇచ్చిన గొప్ప బహుమతిగా భావించేవారని శ్యామలా దేవి పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..

కృష్ణంరాజు మరణం తర్వాత తాము తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్ళినప్పుడు, ప్రభాస్ తనకు ఎంతో ధైర్యాన్నిచ్చారని శ్యామలా దేవి తెలిపారు. ప్రభాస్ భోజనం గురించి మాట్లాడుతూ.. కృష్ణంరాజు మాదిరిగానే ప్రభాస్ సైతం భోజనప్రియుడని తెలిపారు. కనిపించిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టడం ప్రభాస్ స్టైల్ అని.. షూటింగ్ సెట్ లో సైతం ఒక్కడే అసలు తినడు అని. చుట్టూ 10, 20 మందితో కలిసి భోజనం చేస్తాడని అన్నారు. ప్రభాస్ కోసం స్పెషల్ కుకింగ్ టీమ్ ఉందని సమాచారం. ఒక రోజులో దాదాపు 2 లక్షల విలువ ఫుడ్ ప్రీపెర్ చేసి సెట్ లో అందరికి వడ్డిస్తారని టాక్. మటన్, చికెన్, చేపలు, రొయ్యలు, పీతలు వంటి వంటకాలు ఎక్కువగా చేస్తారని సమాచారం.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..

Follow Us