Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

సినీరంగంలో స్టార్ హీరోహీరోయిన్స్ ఫిట్నెస్, లుక్స్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కాస్త బరువు పెరిగినా తారల లుక్స్ పై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్ చేస్తుంటారు. కానీ మీకు తెలుసా.. ? ఎలాంటి డైట్ ప్లానింగ్ లేకుండా దాదాపు 35 కిలోల బరువు తగ్గారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన డైట్ సీక్రెట్ రివీల్ చేసింది.

Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
Bhumi

Updated on: Aug 28, 2025 | 5:24 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. కానీ ఒక సినిమా కోసం దాదాపు 100 కిలోల బరువు పెరిగింది. ఆ తర్వాత మరో సినిమా కోసం ఎలాంటి డైట్ లేకుండానే దాదాపు 35 కిలోల బరువు కంటే ఎక్కువ తగ్గిందట. ఆమె మరెవరో కాదండి.. భూమి పెడ్నేకర్. 2021లో వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భూమి మాట్లాడుతూ 2015లో తన మొదటి చిత్రం ‘దమ్ లగా కే హైషా’ పాత్ర కోసం దాదాపు 30 కిలోల బరువు పెరిగానని చెప్పింది. ఆ తర్వాత నటిగా కొనసాగేందుకు ఓపికగా ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించానని అన్నారు. బరువు తగ్గిందేకు ఎప్పుడు ఆకలితో ఉండలేదు. అందుకు బదులుగా ఆమె చిన్న చిన్న ఆహార మార్పులు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..

ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్.. 

ఇవి కూడా చదవండి

భూమి రోజు తాను చేసే వ్యాయామాలను కొత్త కొత్త ప్రయోగాలు చేసింది. శరీరంలో అన్ని భాగాలు యాక్టివ్ అయ్యేలా వర్కవుట్స్ చేసింది. అలాగే రోజూ పరిగెత్తడం, వెయిట్ లిఫ్టింగ్ చేసింది. తన రోజూను పరుగుతో ప్రారంభించేది. ఎక్కువగా పోషకమైన అల్పాహారం తీసుకుంటాడు. మధ్యాహ్నం జిమ్‌కు వెళ్లి దాదాపు గంటసేపు వ్యాయామం చేసింది.

ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..

జిమ్‌లో వ్యాయామం చేయడమే కాకుండా, రోజంతా చురుకుగా ఉండటానికి ప్రతిరోజూ 7,000 నుండి 8,000 అడుగులు నడవాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. ఎంత తింటున్నాం అనే దానికంటే, ఏమి తింటున్నాం అనేది చాలా ముఖ్యమని.. పూర్తిగా శాఖాహారిగా మారిపోయినట్లు గుర్తు చేసింది. అల్పాహారంలో గింజలు, పండ్లు ఉండాలని, శరీరానికి శక్తిని, పోషణను అందించే ఆహారాన్ని మాత్రమే తీసుకున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..