Balakrishna: ఒక్క ఫైట్ కూడా లేకుండా బాక్సాఫీస్ హిట్టు కొట్టిన బాలయ్య.. ఇంతకీ ఏ సినిమానో తెలుసా.. ?
నందమూరి హీరో బాలకృష్ణ ఫాలోయింగ్ చెప్పక్కర్లేదు. మాస్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక తన సినిమాల్లో బాలయ్య చెప్పే డైలాగ్స్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. కానీ మీకు తెలుసా.. ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా సూపర్ హిట్ అందుకున్నారు బాలయ్య.

మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ నందమూరి బాలకృష్ణ. ఇతర హీరోల సినిమాల్లో లేని యాక్షన్ సీన్స్ బాలయ్య సినిమాల్లో ఉంటాయి. ఆయన చిత్రాల కోసమే ప్రత్యేకంగా అడియన్స్ ఊహించని యాక్షన్ సీన్స్ క్రియేట్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. బాలకృష్ణ సినిమా వచ్చిందంటే చాలు.. కామెడీ, సెంటిమెంట్ కాకుండా యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉన్నాయో చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక అభిమానులు కోరుకున్నట్లుగానే బాలయ్యను మరింత యాక్షన్ హీరోగా చూపించేందుకు దర్శకులు ప్లాన్ చేస్తుంటారు. ఫైట్స్, యాక్షన్ లేకుండా బాలయ్య సినిమాలను ఊహించుకోవడం సాధ్యమేనా.. ? కానీ నిజమే…ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా బాలయ్య సినిమా తీశారు. అది కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇంతకీ అది ఏ సినిమానో తెలుసా.. ?
బాలకృష్ణ మొదట తన తండ్రి ఎన్టీఆర్ సినిమాల్లో నటించారు. చిన్న చిన్న పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు. అందులో ఎక్కువగా పౌరాణిక చిత్రాలే ఉన్నాయి. సాహసమే జీవితం సినిమాతో సోలో హీరోగా మారాడు బాలకృష్ణ. కమర్షియల్ సినిమాలతో భారీ విజయాలను అందుకున్నారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బాలయ్య ఫైట్స్ లేకుండా సినిమా తీశాడని మీకు తెలుసా.. ? అవును.. డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన సినిమా నారీ నారీ నడుమ మురారి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరపైకి వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించారు.
ఇందులో శోభన, నిరోష హీరోయిన్లుగా నిటంచారు. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించే అబ్బాయిగా బాలయ్య కనిపించారు. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో ఎలాంటి యాక్షన్ సీన్స్, ఫైట్స్ లేవు. 1990 ఏప్రిల్ 25న విడుదలైన ఈ సినిమా ఊహించని విజయం అందుకుంది. నిజానికి ఇందులో ఒక్క ఫైట్ సీన్ కూడా లేకపోవడంతో డిజాస్టర్ అవుతుందని అనుకున్నారు. కానీ థియేటర్‌లోకి ప్రవేశించడానికి జనం క్యూలో నిలబడటం చూసి మేకర్స్ ఆశ్చర్యపోయారు. బాలయ్య కెరీర్ లో 50వ సినిమాగా వచ్చింది. ప్రస్తుతం అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు బాలయ్య.
ఇవి కూడా చదవండి :